Nepal Plane Crash | దర్యాప్తులో కీలకమైన బ్లాక్ బాక్స్ లభ్యం
నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండవుతూ యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన 72 సీటర్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 72 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో ఆ ఎయిర్‌క్రాఫ్ట్‌లో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. ఎయిర్‌క్రాఫ్ట్ కూలిన వెంటనే పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో దానిలో ఉన్న అందరూ మంటల్లో కాలి ప్రాణాలు కోల్పోయారు.
Nepal Plane Crash | నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండవుతూ యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన 72 సీటర్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 72 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో ఆ ఎయిర్‌క్రాఫ్ట్‌లో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. ఎయిర్‌క్రాఫ్ట్ కూలిన వెంటనే పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో దానిలో ఉన్న అందరూ మంటల్లో కాలి ప్రాణాలు కోల్పోయారు.
ఘటనలో కీలక ఆధారమైన బ్లాక్‌బాక్స్ తాజాగా లభ్యమైంది. ఈ విషయాన్ని కాఠ్మాండూ ఎయిర్పోర్ట్ అధికారులు సోమవారం ఉదయం ప్రకటించారు. ప్రమాదానికి గల కారణాలను విమానం వెనుక భాగంలో అమర్చి ఉండే ఈ బ్లాక్ బాక్స్ ద్వారా తెలుసుకోవచ్చని వెల్లడించారు. విమాన ప్రమాదం ఎలా జరిగిందో బ్లాక్ బాక్స్ ద్వారా తెలుస్తుందన్నారు. బ్లాక్ బాక్స్‌లో ఫ్లయిట్ డాటా రికార్డర్‌తో పాటు కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ కూడా ఉండటం వల్ల దర్యాప్తులో ఇది చాలా కీలకంగా మారుతుందని వెల్లడించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Basar IIIT | బాసర ట్రిపుల్ ఐటీకి నీటి కరువు.. నీటి సమస్యతో తరగతులు బంద్
Cyclone Arnab | ‘అర్ణబ్’తో కోస్తాంధ్రకు వణుకు వాతావరణ శాఖ హైఅలర్ట్
Land Scam | అసైన్డ్ ఖల్లాస్.. 1000 కోట్ల విలువైన లావణి భూముల్లో బిగ్ విల్లాస్!.. మంఖాల్‌లో భూ కైంకర్యం
Horoscope | 26-10-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
ఆ ఆలస్యం నాకిష్టంలేదు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

