Egg Vs Chicken | కోడి ముందా? గుడ్డు ముందా?.. శాస్త్రవేత్తల సమాధానం ఏమిటంటే..
కోడి ముందా? గుడ్డు ముందా? స్కూల్ పిల్లల నుంచి మొదలుపెడితే ప్రఖ్యాత శాస్త్రవేత్తల వరకు యావత్తు మానవాళిని వేధించే ప్రశ్న ఇది. ఈ ప్రశ్నకు శాస్త్రవేత్తలు ఎట్టకేలకు సమాధానం కనుగొన్నారు. కోడి కంటే గుడ్లే ముందు తయారయ్యాయని, భూమిపై జీవం ఆవిర్భవించిన సమయంలోనే గుడ్లు సైతం ఏర్పడ్డాయని చెప్పారు.
Egg Vs Chicken | న్యూయార్క్, అక్టోబర్ 14: కోడి ముందా? గుడ్డు ముందా? స్కూల్ పిల్లల నుంచి మొదలుపెడితే ప్రఖ్యాత శాస్త్రవేత్తల వరకు యావత్తు మానవాళిని వేధించే ప్రశ్న ఇది. ఈ ప్రశ్నకు శాస్త్రవేత్తలు ఎట్టకేలకు సమాధానం కనుగొన్నారు. కోడి కంటే గుడ్లే ముందు తయారయ్యాయని, భూమిపై జీవం ఆవిర్భవించిన సమయంలోనే గుడ్లు సైతం ఏర్పడ్డాయని చెప్పారు. అయితే, ఇవి కోడి గుడ్లు కావట. 60 కోట్ల సంవత్సరాల క్రితం మొదటిసారి గుడ్లు ఏర్పడ్డాయని, అప్పట్లో పాలిచ్చే జంతువులు మినహా అన్ని జంతువులూ గుడ్లు పెట్టేవని చెప్తున్నారు.
ఇప్పటి గుడ్లతో పోలిస్తే అప్పటి గుడ్లు చాలా భిన్నంగా ఉండేవని, చాలా చిన్నగా, మనిషి వెంట్రుకల కంటే తక్కువ మందంగా ఉండేవని భావిస్తున్నారు. ఇక కోళ్ల సంగతికి వస్తే.. దాదాపు 5 కోట్ల ఏండ్ల క్రితం గల్లస్ గల్లస్ అనే ఎర్ర అడవి జాతి పక్షుల నుంచి రూపాంతరం చెందాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
ఇప్పుడు ఉన్న దేశీయ కోళ్లు మాత్రం దాదాపు 10 వేల ఏండ్ల క్రితం ఉద్భవించాయని గతంలో శాస్త్రవేత్తలు ఓ పరిశోధన ద్వారా గుర్తించారు. కాబట్టి, కోడి ముందా? గుడ్డు ముందా ? అని అడిగితే గుడ్డే ముందని చెప్పవచ్చని, కానీ కోడిగుడ్డు కంటే మాత్రం కోడి ముందు అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎర్ర అడవి జాతి పక్షి పెట్టిన గుడ్ల నుంచి ఇప్పుడున్న కోళ్లు పుట్టాయి. ఆ తర్వాత కోళ్లు గుడ్లు పెట్టాయి. కాబట్టి ఇప్పటి గుడ్ల కంటే ముందే కోడి జన్మించినట్టు అర్థం చేసుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Train Trailer | మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు విజయ్ సేతుపతి.. ఆకట్టుకుంటున్న ‘ట్రైన్’ ట్రైలర్!
Diksha Divas | ముఖ్రా (కె) గ్రామంలో ఒకరోజు ముందే దీక్షా దివస్.. కేసీఆర్ చిత్రపటానికి పూలు, పాలతో అభిషేకం.. Video
Ramayana | బాహుబలి 2 రికార్డు బద్దలు కొట్టిన ‘రామాయణ’.. 23 రోజుల్లోనే రూ.1,790 కోట్ల వసూళ్లు
Mysaa | ‘మైసా’ క్లైమాక్స్ నచ్చలేదా? రష్మిక సినిమా వాయిదా వెనుక అసలు కారణం ఇదేనా!
Anil Ravipudi | అనిల్ రావిపూడి రామాయణం.. త్వరలోనే యానిమేషన్ మూవీ,స్వయంగా ప్రకటించిన స్టార్ డైరెక్టర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

