Tourist Boat | పర్యాటకులతో వెళ్తున్న పడవ బోల్తా.. నలుగురు మృతి, 38 మంది గల్లంతు
ఇండోనేషియాలోని బాలిలో పర్యాటకులతో వెళ్తున్న పడవ (Tourist Boat) నీటమునింది. దీంతో నలుగురు మరణించగా, 61 మంది గల్లంతయ్యారు. 53 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో జావా నుంచి బాలి వెళ్తున్న పడవ బుధవారం రాత్రి 11.20 గంటలకు ప్రమాదానికి గురై నీట మునిగింది.
బాలి: ఇండోనేషియాలోని బాలిలో పర్యాటకులతో వెళ్తున్న పడవ (Tourist Boat) నీటమునింది. దీంతో నలుగురు మరణించగా, 61 మంది గల్లంతయ్యారు. 53 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో జావా నుంచి బాలి వెళ్తున్న పడవ బుధవారం రాత్రి 11.20 గంటలకు ప్రమాదానికి గురై నీట మునిగింది. దీంతో అందులో ఉన్న 65 మంది గల్లంతయ్యారు. అయితే వారిలో నలుగురు మరణించగా, ఇప్పటివరకు 23 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు. మరో 38 మంది ఆచూకీ లభించలేదని, వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
పడవలో 14 ట్రక్కులుసహా 22 వాహనాలు ఉన్నాయని తెలిపారు. దాదాపు 17 వేల దీవులతో కూడిన ద్వీపసమూహం అయిన ఇండోనేషియాలో భద్రతా ప్రమాదాలు లోపించడంతో నిత్యం సముద్ర ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈఏడాది మార్చిలో బాలి తీరంలో 16 మందితో ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ ఆస్ట్రేలియన్ మహిళ మరణించింది. 2018లో సుమత్రా ద్వీపంలో పడవ నీటమునగడంతో ప్రమాదంలో 150 మంది నీటమునిగారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajkumar Periyasamy | అది సీక్వెల్ కాదు, అక్కడితోనే క్లోజ్.. ధనుష్ ‘ఓం’ సినిమాపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!
Srinivas Goud | రైతాంగానికి ఎకరాకు రూ. 25 వేల నష్టపరిహారం చెల్లించాలి: మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
KTR | పబ్లిక్ గొంతు నొక్కడం ఏ రకమైన పబ్లిక్ హియరింగ్ అవుతుంది : కేటీఆర్
Culinary Medicine | ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం పొందుతున్న క్యులినరీ మెడిసిన్.. అసలేమిటి.. ఏం చేస్తుంది..?
Electric Shock | దుస్తులు ఆరేస్తుండగా విద్యుదాఘాతం..భార్యభర్తలు మృతి
ట్రెండింగ్ వార్తలు
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!

