Mega Millions Jackpot | న్యూజెర్సీ: న్యూజెర్సీకి చెందిన ఓ వ్యక్తిని లాటరీలోఅదృష్ట దేవత వరించింది. దాదాపు 30 డ్రాయింగ్స్ నుంచి భారీ బహుమతి ఎవరికీ దక్కలేదు. చివరికి మంగళవారం రాత్రి జరిగిన డ్రాయింగ్‌లో విజేతకు రూ.9,417.60 కోట్ల జాక్‌పాట్ తగిలింది. ఈ మెగా మిలియన్స్ జాక్‌పాట్ లాటరీలో గత ఏడాది డిసెంబరు 8 తర్వాత ఆరు నంబర్లు మ్యాచ్ అవడం ఇదే తొలిసారి.
ఈ టికెట్ జెర్సీ షోర్‌లోని ఓ షాపులో అమ్ముడైనట్లు లాటరీ నిర్వాహకులు తెలిపారు. అమెరికన్ లాటరీ చరిత్రలో ఈ బహుమానం ఎనిమిదో అతి పెద్దది కావడం విశేషం. విజేతకు ఈ సొమ్ములో కొంత భాగం ముందుగా చెల్లించి, ఆ తర్వాత 29 వార్షిక వాయిదాల్లో మిగిలిన భాగాన్ని చెల్లిస్తారు.