కొలంబియా జైలులో ఘర్షణ.. 51 మంది ఖైదీలు మృతి
Colombia | లాటిన్ అమెరికా దేశమైన కొలంబియాలోని ఓ జైలులో ఖైదీల మధ్య తలెత్తిన ఘర్షణ మరణాలకు దారితీసింది. నైరుతి కొలబియాలోని తులువా జైలులో ఖైదీల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇందులో 51 మంది మరణించారు.
తులువా: లాటిన్ అమెరికా దేశమైన కొలంబియాలోని ఓ జైలులో ఖైదీల మధ్య తలెత్తిన ఘర్షణ మరణాలకు దారితీసింది. నైరుతి కొలబియాలోని తులువా జైలులో ఖైదీల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇందులో 51 మంది మరణించారు. మరో 30 మంది గాయపడ్డారు. జైలులో మంగళవారం ఖైదీలు మధ్య గొడవ మొదలైంది. దీనిని ఆపడానికి గార్డులు ప్రయత్నించారు. అయితే వారిని అడ్డుకోవడానికి ఖైదీలు.. దుప్పట్లు, ఇతర వస్తువులకు నిప్పంటించారు. దీంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ఆ పొగతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు.
ఈ ఘటనలో దాదాపు 30 మంది గాయపడ్డారని, వారిలో జైలు సిబ్బంది కూడా ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం జైలులో మంటలు అదుపులోకి వచ్చాయని, ఖైదీలెవరూ తప్పించుకోలేదని చెప్పారు. ఈ ఘటన జరిగిన సమయంలో అందులో 1,267మంది ఖైదీలు ఉన్నారని వెల్లడించారు. మంటలు చెలరేగిన బ్లాక్‌లో 180 మంది ఉన్నట్లు తెలుస్తున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Colombia
- inmates
- riot
- Tolua prison
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

