యూఏఈలో తెలుగు వ్యక్తికి రూ 240 కోట్ల లాటరీ
బుదాబిలో నివసిస్తున్న 29 ఏళ్ల అనిల్‌కుమార్ బొల్లా అనే ఏపీ యువకుడు యూఏఈ లాటరీ చరిత్రలోనే అతి పెద్దదైన 100 మిలియన్ దిర్హామ్‌లు (సుమారు రూ. 240 కోట్లకు పైగా) జాక్‌పాట్‌ను గెలుచుకున్నాడు!
- జాక్‌పాట్ కొట్టిన అనిల్‌కుమార్ బొల్లా
- లాటరీ నంబర్‌గా అమ్మ పుట్టిన రోజు
న్యూఢిల్లీ: అబుదాబిలో నివసిస్తున్న 29 ఏళ్ల అనిల్‌కుమార్ బొల్లా అనే ఏపీ యువకుడు యూఏఈ లాటరీ చరిత్రలోనే అతి పెద్దదైన 100 మిలియన్ దిర్హామ్‌లు (సుమారు రూ. 240 కోట్లకు పైగా) జాక్‌పాట్‌ను గెలుచుకున్నాడు! అక్టోబరు 18న జరిగిన 23వ లక్కీ డే డ్రాలో అనిల్‌కుమార్ ఈ బహుమతిని గెలుచుకున్నట్టు లాటరీ నిర్వాహకులు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన విజయం గురించి అనిల్‌కుమార్ మాట్లాడుతూ.. తాను ప్రత్యేకంగా మ్యాజిక్ ఏమీ చేయలేదని, ‘ఈజీ పిక్’ ద్వారా టికెట్‌ను ఎంచుకున్నానని తెలిపాడు. కానీ ఆ టికెట్‌లోని చివరి నంబర్ చాలా ప్రత్యేకమని, అది తన తల్లి పుట్టిన రోజు అని చెప్పాడు. గెలిచిన విషయం తెలియగానే, తాను సోఫాలో కూర్చుని షాక్‌లో ఉండిపోయానని తన ఆనందాన్ని పంచుకున్నాడు.
పెద్ద మొత్తంలో డబ్బు రావడంతో, ఆ డబ్బును బాధ్యతాయుతంగా ఖర్చు చేయాలని, సరైన మార్గంలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్టు చెప్పాడు. తాను పెద్ద మొత్తాన్ని గెలిచానని, ఇప్పుడు సరైన మార్గంలో ఆలోచించి మంచి పని చేయాలనుకుంటున్నానని అన్నాడు. అనిల్‌కుమార్ అతిపెద్ద కోరిక ఏంటంటే, తన కుటుంబాన్ని యూఏఈకి తీసుకువచ్చి, వారి వెంట ఉంటూ సంతోషంగా జీవితాన్ని గడపడం. గెలుచుకున్న మొత్తంలో కొంత భాగాన్ని దానం చేయాలని కూడా ఆయన నిర్ణయించుకున్నాడు.
సరదాగా ఒక సూపర్ కార్ కొని, ఒక లగ్జరీ రిసార్ట్ లేదా సెవెన్ స్టార్ హోటల్లో సెలబ్రేట్ చేసుకోవాలని కూడా ఆయన ఉవ్విళ్లూరుతున్నాడు. ‘ప్రతిదీ ఒక కారణం కోసమే జరుగుతుందని నేను నమ్ముతాను. ప్రతీ ఒక్కరూ ఆడుతూ ఉండండి, కచ్చితంగా ఒక రోజు అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది’ అని తోటి లాటరీ ఆటగాళ్లకు సందేశం ఇచ్చాడు. ఈ అద్భుతమైన అవకాశాన్ని కల్పించినందుకు యూఏఈ లాటరీకి ఆయన కృతజ్ఞతలు తెలిపాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

