మెటాకు 2 లక్షల కోట్ల జరిమానా
వినియోగదారుల డాటా గోప్యత విషయంలో ప్రజలను తప్పుదారి పట్టించిందన్న కేసులో ఫేస్బుక్ మాతృసంస్థ మెటా ప్లాట్‌ఫామ్స్‌పై అమెరికాలోని న్యూ మెక్సికో న్యాయస్థానం తీవ్ర స్థాయిలో మండిపడింది.
న్యూ మెక్సికో: వినియోగదారుల డాటా గోప్యత విషయంలో ప్రజలను తప్పుదారి పట్టించిందన్న కేసులో ఫేస్బుక్ మాతృసంస్థ మెటా ప్లాట్‌ఫామ్స్‌పై అమెరికాలోని న్యూ మెక్సికో న్యాయస్థానం తీవ్ర స్థాయిలో మండిపడింది. సంస్థకు 25 బిలియన్ డాలర్లు(దాదాపు రూ. 2 లక్షల కోట్లు) రికార్డు స్థాయి జరిమానా విధిస్తూ జడ్జి ఫ్రాన్సిస్ మాథ్యూ ఆదేశాలు జారీ చేశారు.
2016 నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో బ్రిటిష్ రాజకీయ కన్సల్టింగ్ సంస్థ ‘కేంబ్రిడ్జ్ అనలిటికా’ సమారు 8.7 కోట్ల మంది ఫేస్బుక్ వినియోగదారుల వివరాలను సేకరించిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. వినియోగదారుల సమాచారాన్ని ఎవరెవరు యాక్సెస్ చేయవచ్చనే వాస్తవాలను దాచిపెట్టి, ప్రజలను ‘మెటా’ తప్పుదోవ పట్టిస్తున్నదని ఆరోపిస్తూ న్యూ మెక్సికో అటార్నీ జనరల్ 2021లో ఈ దావా వేశారు. గత సెప్టెంబర్‌లో ఈ కేసును విచారించిన న్యాయ నిర్ణేతల బృందం ‘మెటా’ యాజమాన్యం డాటా ప్రైవసీ, భద్రత తదితర అంశాలపై చేసిన 29 బహిరంగ ప్రకటనల్లో 26 ప్రకటనలు పచ్చి అబద్ధాలని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని నిర్ధారించింది. న్యూ మెక్సికో వినియోగదారుల పరిరక్షణ చట్టాల పరిధిలో ‘మెటా’ దాదాపు 4.3 కోట్లకు పైగా ఉల్లంఘనలకు పాల్పడిందని జ్యూరీ తేల్చింది.
మెక్సికో చట్టాల ప్రకారం మెటాకు 219 బిలియన్ల డాలర్లకు పైగా జరిమానా విధించే అవకాశం ఉన్నప్పటికీ, న్యాయమూర్తి ఆ మొత్తాన్ని 25 బిలియన్ డాలర్లకు పరిమితం చేశారు. దాదాపు 2 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువ కలిగిన మెటాకు ఈ జరిమానా తాత్కాలికంగా పెద్ద భారం కానున్నదని విశ్లేషకులు అంటున్నారు. అలాగే కంపెనీ సుదీర్ఘ అప్పీల్ ప్రక్రియను కొనసాగించే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | మళ్లీ బీఆర్ఎస్ రావాలి.. కేసీఆర్ సీఎం కావాలి.. రెండో రోజుకు చేరిన ఏడుపాయల–ఎర్రవల్లి పాదయాత్ర
AakasamLo Oka Tara | సెన్సార్ పూర్తి చేసుకున్న దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’.. నవంబర్ 20న గ్రాండ్ రిలీజ్!
US Student Visa | విదేశీ విద్యార్థులకు భారీ ఊరట.. ట్రంప్ సర్కారు ప్రతిపాదనను కొట్టివేసిన అమెరికా కోర్టు!
Sarpanch Elections: సర్పంచ్ ఎన్నికల్లో హింస.. పోల్ సిబ్బందిపై దాడి, మెజిస్ట్రేట్ కారు దగ్ధం
418 Movie | ఓటీటీలోకి ప్రశాంత్ నీల్ హారర్ థ్రిల్లర్ ‘418’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

