2 డోసుల ఆస్ట్రాజెనికా టీకాలతో 90 శాతం రక్షణ : బ్రిటన్

లండన్: ఆస్ట్రాజెనికా కంపెనీకు చెందిన రెండు డోసుల టీకాలు వేసుకుంటే.. కోవిడ్ నుంచి సుమారు 90 శాతం రక్షణ ఉంటుందని ఇంగ్లండ్‌కు చెందిన ప్రజారోగ్య సంస్థ పేర్కొన్నది. దీనికి సంబంధించిన డేటాను పబ్లిక్ హెల్త్ శాఖ రిలీజ్ చేసింది. మే 9వ తేదీ నాటికి ఇంగ్లండ్‌లో 60 ఏళ్లు దాటినవారిలో.. సుమారు 13000 మరణాలను నియంత్రించగలిగినట్లు ఆ దేశ ఆరోగ్య సంస్థ చెప్పింది. ఇక వ్యాక్సిన్లు ఇవ్వడం వల్ల 65 ఏళ్లు దాటినవారిలో సుమారు 40 వేల మంది హాస్పిటల్ ఇబ్బందుల నుంచి దూరమైనట్లు డేటాలో వెల్లడించారు. మహమ్మారి కరోనా వల్ల ఇంగ్లండ్ భారీ స్థాయిలో మరణాలు సంభవించాయి. కానీ వ్యాక్సినేషన్ ప్రక్రియ తర్వాత ఆ విపత్తు ఆగినట్లు తెలుస్తోందని పబ్లిక్ హెల్త్ పేర్కొన్నది.
కోవిడ్ 19 నుంచి వ్యాక్సిన్లు మన ప్రాణాలు కాపాడుతాయన్న విషయం తాజా డేటా స్పష్టం చేస్తున్నదని ఆరోగ్యశాఖ మంత్రి మ్యాట్ హాన్కాక్ తెలిపారు. కొత్త వేరియంట్లు దాడి చేస్తున్న తరుణంలో.. వ్యాక్సినేషన్ ప్రక్రియ చాలా కీలకమైందన్నారు. బ్రిటన్‌లో ఇప్పటి వరకు మూడవ వంత జనాభాకు వ్యాక్సిన్లు ఇచ్చారు. వీలైనంత వరకు ఫస్ట్ డోసును ఇచ్చేశారు. ఇక రెండవ డోసు కోసం మాత్రం 12 వారాల గడువును విధించారు. వ్యాక్సిన్ల మధ్య గడువును పెంచడం వల్ల.. శరీరంలో వైరస్‌కు వ్యతిరేకంగా ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలు 20 నుంచి 300 శాతం వరకు పెరిగే అవకాశాలు ఉన్నట్లు తాజా సర్వే అభిప్రాయపడింది. ఆక్స్ఫర్డ్ వర్సిటీ శాస్త్రవేత్తలు డెవలప్ చేసిన కోవిడ్ టీకాలను ఆస్ట్రాజెనికా ఉత్పత్తి చేస్తున్నది. అయితే ఆ టీకాలనే కోవీషీల్డ్ పేరుతో ఇండియాలో సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

