Heatwaves | యూరప్‌లో వేడిగాలులతో 12,000 మంది మృతి..! మరింత పెరిగే అవకాశం
Heatwaves | శీతల ఖండం యూరప్‌లో(Europe) వేడిగాలులు ప్రజల్లో వణుకు పుట్టిస్తున్నాయి. పలు దేశాలు హీట్ డోమ్ వల్ల ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి.
Heatwaves | శీతల ఖండం యూరప్‌లో(Europe) వేడిగాలులు ప్రజల్లో వణుకు పుట్టిస్తున్నాయి. పలు దేశాలు హీట్ డోమ్ వల్ల ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ప్రచండ వేడి గాలులను తట్టుకోలేక ప్రజలు అల్లాడిపోతు న్నారు. అనేక దేశాలలో ప్రమాదకర స్థాయిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణో గ్రతలు పెరుగుతుండంటంతో వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.
ఒక్క జూన్‌లో సంభవించిన వేడిగాలులతోనే 9 యూరోపియన్ దేశాలలో కనీసం 12,000 మంది చనిపోయి నట్లు పలు గణాంకాల వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీ, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, స్పెయిన్, స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్డమ్ దేశాలు హీట్ వేవ్‌కు తీవ్రంగా ప్రభావితమ య్యాయి. తీవ్రమైన ఉష్ణోగ్రతల కారణంగా గుండె, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు మరింత తీవ్ర మవ్వడం తోదాదాపు 85% మంది 65 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు మృతి చెందారని పలు ఆరోగ్య సంస్థలు వెల్లడించా యి. ఇంకా ఈ మరణాలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తీవ్రమైన వడగాడ్పులు అంతటా విస్తరిస్తుండడంతో యూరప్‌లోని అనేక ప్రాంతాలు ప్రస్తుతం తీవ్రమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు అనేక దేశాలలో జనజీవనం, ప్రజారోగ్యం, మౌలిక సదుపాయాలపై ప్రభావం చూపుతున్నాయి. ఇవి మానవ తప్పిదాల వల్లే జరుగుతున్నా యని, వీటిని సరి చేయలేక భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్కు చెందిన వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- 000 people died
- 12
- Europe
- heat dome
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

