Pakistan clashes | పాకిస్థాన్‌లో రెండు తెగల మధ్య ఘర్షణ.. 11 మంది దుర్మరణం
Pakistan clashes | పొరుగు దేశం పాకిస్థాన్‌లో మరోసారి రెండు తెగల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సున్నీ, షియా ముస్లింలకు మధ్య జరిగిన ఈ ఘర్షణల్లో 11 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారు వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
Pakistan clashes : పొరుగు దేశం పాకిస్థాన్‌లో మరోసారి రెండు తెగల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సున్నీ, షియా ముస్లింలకు మధ్య జరిగిన ఈ ఘర్షణల్లో 11 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారు వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పాకిస్థాన్‌లోని ఖైబర్ ఫక్తుంఖ్వా ప్రావిన్స్‌లోగల కుర్రమ్ జిల్లాలో ఈ ఘర్షణలు జరిగాయి. దాంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు రెండు వర్గాల వారిని చెదరగొట్టారు. ఎవరూ గుంపులుగా బయటికి రాకుండా కర్ఫ్యూ విధించారు. శనివారం ఉదయం ఒక వర్గానికి చెందిన వ్యక్తులు మరో వర్గానికి చెందిన వారే లక్ష్యంగా కాల్పులు జరపడంతో ఇద్దరు మరణించారు. ఈ విషయం జిల్లా అంతటా వ్యాపించి ఘర్షణలు చెలరేగాయి. పలుచోట్ల ఒకవర్గంపై మరో వర్గం కాల్పులు జరుపుకున్నారు. ఈ ఘర్షణలు 11 మందిని బలితీసుకున్నాయి.
పాకిస్థాన్‌లోని ఖైబర్ ఫక్తుంఖ్వా ప్రావిన్స్‌లో గత నెలలో కూడా సున్నీ, షియా ముస్లిం తెగల మధ్య ఘర్షణలు జరిగాయి. ఆ ఘర్షణల్లో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనను మరువకముందే ఇప్పుడు మరోసారి ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో ఎంతో కాలంగా సున్నీ, షియా తెగల ముస్లింలు కలిసి మెలిసి జీవిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు తరచూ రెండు తెగల మధ్య ఘర్షణలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff: టైగర్ ష్రాఫ్ కేసు ముంబై క్రైం బ్రాంచ్‌కు.. ముగ్గురు నిందితులు అరెస్టు
Vaccine | విదేశాలకు వెళ్లే ముందు ఈ టీకా గురించి తెలుసుకోండి.. యువతకు కీలక సూచన..
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

