TSRTC | తప్పిన చిల్లర తిప్పలు.. సిటీ బస్సుల్లో యూపీఐ సేవలు
నగరంలోని అన్ని రకాల సిటీ బస్సుల్లో యూపీఐ డిజిటల్ లావాదేవీల ద్వారా టికెట్ జారీ చేసే ప్రక్రియకు ఆర్టీసీ యాజమాన్యం శ్రీకారం చుట్టబోతున్నది. దీని వల్ల ప్రయాణికులతోపాటు ఆర్టీసీ కండక్టర్లకు కూడా ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని, పైగా సిటీ బస్సుల్లో చిల్లర సమస్య తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.
- టెక్నాలజీ ఉపయోగంపై ఆర్టీసీ ప్రత్యేక దృష్టి
- ఇప్పటికే జిల్లా, పుష్పక్ సర్వీసుల్లో అమలు
TSRTC | సిటీబ్యూరో, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : నగరంలోని అన్ని రకాల సిటీ బస్సుల్లో యూపీఐ డిజిటల్ లావాదేవీల ద్వారా టికెట్ జారీ చేసే ప్రక్రియకు ఆర్టీసీ యాజమాన్యం శ్రీకారం చుట్టబోతున్నది. దీని వల్ల ప్రయాణికులతోపాటు ఆర్టీసీ కండక్టర్లకు కూడా ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని, పైగా సిటీ బస్సుల్లో చిల్లర సమస్య తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు నగరంలో దాదాపు 2,500పైగా ఉన్న ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో యూపీఐ సేవల ద్వారా టికెట్ జారీ చేసే ప్రక్రియ ఉన్నది. అయితే ఇప్పటికే..ఆర్టీసీకి సంబంధించిన జిల్లా సర్వీసు.. అంటే మెట్రో లగ్జరీ, ఏసీ బస్సుల్లో యూపీఐ విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు.
అలాగే నగరంలోని ఎయిర్‌పోర్టుకు తిరిగే ఏసీ బస్సుల్లోనూ క్యూఆర్ కోడ్ ద్వారా టికెట్ జారీ చేస్తున్నారు. తాజాగా సిటీ బస్సుల్లో యూపీఐ డిజిటల్ లావాదేవీల ద్వారా టికెట్ జారీ చేసేందుకు ఆర్టీసీ యాజమాన్యం అన్ని బస్సుల్లో ఐ-టీమ్స్ యంత్రాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇప్పటికే ఐ-టీమ్స్ యంత్రాలను పంపిణీ చేసే సంస్థతో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ జోన్ అధికారులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BSF camp | బీఎస్ఎఫ్ క్యాంప్‌లో ఫుడ్ పాయిజనింగ్.. 75 మంది సిబ్బంది ఆస్పత్రిపాలు
‘రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ కోతలు – ఎండిపోతున్న పంటలు’
Bribery Case: డిఫెన్స్ డీల్ లంచం కేసులో ఆశిష్ కన్సల్, అనిల్ కుమార్ అరెస్టు
Proteins And Fiber | ప్రోటీన్లు, ఫైబర్‌ను తగినంతగా తీసుకోని భారతీయులు.. అధ్యయనంలో వెల్లడి..
Harish Rao | రోడ్డు మీదికి 3 వేల రైతు కుటుంబాలు.. రైతు బీమాపై ప్రభుత్వం తక్షణమే మేల్కోవాలి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

