24 గంటల్లోనే.. ఛేదించారు
మేడ్చల్ నగల దుకాణం దోపిడీ కేసును సైబరాబాద్ పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. కమిషనర్ అవినాశ్ మహంతి, మేడ్చల్ డీసీసీ కోటిరెడ్డితో కలిసి వివరాలను వెల్లడించారు.
- మేడ్చల్ నగల దుకాణం దోపిడీకి యత్నం ఇద్దరు నిందితుల అరెస్టు
సిటీబ్యూరో: మేడ్చల్ నగల దుకాణం దోపిడీ కేసును సైబరాబాద్ పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. కమిషనర్ అవినాశ్ మహంతి, మేడ్చల్ డీసీసీ కోటిరెడ్డితో కలిసి వివరాలను వెల్లడించారు. ఈనెల 20న మేడ్చల్ పీఎస్ పక్కనే ఉన్న జగదాంబ జ్యువెల్లరీ దుకాణంలోకి చొరబడిన దుండగులు.. యజమానిపై కత్తితో దాడిచేసి, దోపిడీకి యత్నించి, పారిపోయారు. నిందితులను పట్టుకునేందుకు 16 పోలీసులు బృందాలు గాలింపు మొదలుపెట్టాయి. సీసీ ఫుటేజీతో నిందితులు వాడిన బైక్ నంబర్ ఆధారంగా వాహన యజమాని హబ్సిగూడకు చెందినట్లు గుర్తించారు.
బైక్ యజమానిని విచారించగా తన బైక్ నాలుగురోజుల కిందట ఓయూ ఠాణా పరిధిలో నుంచి చోరీకి గురైనట్లు వెల్లడించాడు. ముంబైకి చెందిన నజీమ్ అజీజ్ కొటాడియాకు వ్యాపారంలో పెద్ద ఎత్తున నష్టాలు వచ్చాయి. కుటుంబ పోషణ కోసం ర్యాపిడో నడపడం మొదలు పెట్టాడు. వచ్చే ఆదాయం సరిపోక సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. తనతో పాటు రాపిడో నడిపిన మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి చాదర్‌ఘాట్‌లోని నగల దుకాణంలోకి చొరబడి చోరీకి పాల్పడ్డారు. జైలులో షేక్ సోహెల్(23)తో పరిచయం ఏర్పడింది. జైలు నుంచి విడుదలయ్యాక ఇద్దరు కలిసి నగల దుకాణాల్లో దోపిడీకి పాల్పడాలని నిర్ణయించుకున్నారు. పథకం ప్రకారం నజీమ్, సోహెల్ బైక్‌పై వచ్చి..మేడ్చల్‌లో నగల దుకాణంలో దోపిడీకీ యత్నించారు. నాంపల్లి రైల్వేస్టేషన్ వద్ద పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

