RTA | నంబర్ ప్లేట్స్‌తో జరభద్రం.. అంకెలు, అక్షరాల్లో గారడీ వద్దు..!
RTA | నంబర్ ప్లేట్స్‌తో జరభద్రం.. ఇష్టమొచ్చినట్టుగా నంబర్లను రాసుకుంటే ఆర్టీఏ అధికారులకు దొరికినట్టే. జరిమానాలతో పాటు వాహనాలను సీజ్ కూడా చేసే ప్రమాదం ఉంది. ఇటీవల కాలంలో చాలా మంది తమ వాహనాల నంబర్‌ప్లేట్లపై ఇంగ్లిష్ అక్షరాలను పోలి ఉన్న అంకెలను అమర్చుకుంటున్నారు.
- ఎంవీ యాక్ట్ నిబంధనల ప్రకారం నంబర్ ప్లేట్స్ ఉండాల్సిందే..
- సంక్రాంతి దృష్ట్యా ఆర్టీఏ అధికారుల ప్రత్యేక తనిఖీలు
RTA | సిటీబ్యూరో, జనవరి 10(నమస్తే తెలంగాణ): నంబర్ ప్లేట్స్‌తో జరభద్రం.. ఇష్టమొచ్చినట్టుగా నంబర్లను రాసుకుంటే ఆర్టీఏ అధికారులకు దొరికినట్టే. జరిమానాలతో పాటు వాహనాలను సీజ్ కూడా చేసే ప్రమాదం ఉంది. ఇటీవల కాలంలో చాలా మంది తమ వాహనాల నంబర్‌ప్లేట్లపై ఇంగ్లిష్ అక్షరాలను పోలి ఉన్న అంకెలను అమర్చుకుంటున్నారు. మరికొందరు నంబర్లో ఒక అంకెను చెదరగొట్టి వాహనాలను తిప్పుతున్నారు. ఇంకొందరూ ఒకే నంబర్ ప్లేట్‌తో రెండు వాహనాలను నడుపుతున్నారు.
ఇతర రాష్ట్ర వాహనాలు సైతం అనుమతి లేకున్నా ఇక్కడి నంబర్ ప్లేట్స్ తగిలించుకుని రాష్ట్రంలో తిప్పుతున్నారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా వైట్ నంబర్ ప్లేట్ ఉన్న వాహనాలు ప్రయాణికులను ఎక్కించుకుని ట్రిప్పులు కొడుతున్నాయి. దీంతో ప్రభుత్వానికి ఆదాయం రావడంలేదని అధికారులు చెబుతున్నారు. అందులో భాగంగా రవాణా శాఖాధికారులు ప్రత్యేక బృందాలుగా తనిఖీల ప్రక్రియ ముమ్మరం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ట్రావెల్స్ బస్సులపై సైతం నిఘా పెట్టి వాహనాలను సీజ్ చేస్తున్నారు.
ఎంవీ యాక్ట్ 1989.. ఎంవీ యాక్ట్ 50, 51 నిబంధనల ప్రకారం.. ద్విచక్ర వాహనాలు, లైట్ మోటార్ వెహికిల్ కార్లు రిజిస్ట్రేషన్ అంకెలు, అక్షరాలు కచ్చితంగా వైట్ ప్లేట్‌పై బ్లాక్ కలర్లో ఉండాలి. కమర్షియల్ వాహనాలైతే యెల్లో ప్లేట్‌పై బ్లాక్ లెటర్స్‌తో నంబర్ ఉండాలి. రిజిస్ట్రేషన్ నంబర్ రెండు వరుసల్లో ఉండాలి. స్టేట్ కోడ్(టీఎజీ) అండ్ రిజిస్ట్రేషన్ అథారిటీ కోడ్ తర్వాత మిగిలిన నంబర్ రెండో వరుసలో ఉండాలి. హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్‌ను స్కాన్ చేస్తే వెహికిల్ వివరాలతో పాటు ఓనర్ డిటెయిల్స్ మొత్తం తెలుస్తాయని అధికారులు చెబుతున్నారు. వాహనాలు దొంగతనం జరిగినా.. ప్రమాదానికి గురైనా వివరాలు తెలుసుకోవచ్చు.
ట్రావెల్స్‌పై నిఘా..!
నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్‌పై ఆర్టీఏ అధికారులు కొరడా ఝులిపిన్నారు. శుక్రవారం తెల్లవారుజామున గ్రేటర్ వ్యాప్తంగా రవాణా అధికారుల బృందాలు పలు ప్రాంతాల్లో నిఘా పెట్టి వాహనాల తనిఖీ చేశారు. ట్రావెల్స్ రూల్స్‌కు వ్యతిరేకంగా నడుస్తున్న 17 బస్సులను సీజ్ చేశారు. కొన్ని ట్రావెల్ బస్సుల యజమానులపై కేసులు నమోదు చేశారు.ఈనేపథ్యంలో అధికారులు ట్రావె ల్ బస్సులు ఎక్కువగా నడిచే రూట్లల్లో అధికారులు రైడ్ చేశారు. ఫిట్నెస్, ట్యాక్సీ, లైసెన్స్, బీమా, ఫైర్ సేఫ్టీ, ఓవర్‌స్పీడ్, పరిమితికి మించిలోడ్, హారన్ మోత, ఫస్ట్ ఎయిడ్ కిట్ తదితర వాటిని చెక్ చేశారు. కొన్ని ట్రావెల్ బస్సులు ఫైర్ సేఫ్టీ పాటించడంలేదని అధికారులు గుర్తించారు.
నిబంధనల ప్రకారం నడుచుకోవాలి
తనిఖీలు ముమ్మరం చేశాం. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వాహనాలను సీజ్ చేస్తాం. నకిలీ నంబర్ ప్లేట్లతో వాహనాల రాకపోకలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. పండుగ నేపథ్యంలో ప్రయాణాలు చేసే వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అతివేగంతో డ్రైవింగ్ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. హెల్మెట్ ధరించడం, కారు సీటు పెట్టుకోవడం, రోడ్డు నిబంధనలు, వేగ సూచికలకు అనుగుణంగా వెళ్లడం తదితర నిబంధనలు పాటించాలి.
– సి.రమేశ్, హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

