ఉప్పల్ ప్రయాణికుల తిప్పల్
ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల్లో భాగంగా ఉప్పల్ చౌరస్తాను ట్రాఫిక్ అధికారులు మూసివేశారు. దీంతో హైదరాబాద్ నుంచి వరంగల్ వైపునకు, వరంగల్ నుంచి హైదరాబాద్ వైపునకు కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలను పోలీసులు ఏర్పాటు చేశారు. పిస్తాహౌస్ నుంచి బీరప్ప గడ్డ మీదుగా వెళ్లే వాహనాలతో ఆ మార్గంలో ట్రాఫిక్ తీవ్రంగా ఉంది.
- ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులతో ట్రాఫిక్ కష్టాలు
ఉప్పల్, నమస్తే తెలంగాణ : ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల్లో భాగంగా ఉప్పల్ చౌరస్తాను ట్రాఫిక్ అధికారులు మూసివేశారు. దీంతో హైదరాబాద్ నుంచి వరంగల్ వైపునకు, వరంగల్ నుంచి హైదరాబాద్ వైపునకు కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలను పోలీసులు ఏర్పాటు చేశారు.

పిస్తాహౌస్ నుంచి బీరప్ప గడ్డ మీదుగా వెళ్లే వాహనాలతో ఆ మార్గంలో ట్రాఫిక్ తీవ్రంగా ఉంది. ముఖ్యంగా ఉప్పల్ భగాయత్ సర్కిల్ వద్ద వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోతున్నారు. మరోవైపు ఉప్పల్ తాత్కాలిక బస్టాండ్ వద్ద సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో ప్రయాణికులు బస్సుల కోసం ప్రధాన రోడ్డు మీదకు వచ్చి నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అయితే నగరంలో ఎండలు ఠారెత్తిస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి తాత్కాలిక బస్టాండ్ వద్ద వసతులు కల్పించడంతో పాటు ట్రాఫిక్ క్లియరెన్స్‌కు మెరుగైన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajanna Sircilla | చెరువులో మునిగి యువకుడి మృతి.. తండ్రికి దూరమైన ముగ్గురు చిన్నారులు!
భువనగిరి అరోరా కాలేజీలో కలకలం.. విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు లీక్.. వైరల్ అవుతున్న ఆడియో కాల్!
Donald Trump | నాకు 8 నోబెల్ శాంతి బహుమతులు రావాల్సింది.. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి..!
Earthquake | పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు..!
Nara Lokesh | ‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేష్ ప్రశంసలు.. విజయ్ దేవరకొండ నటనకు ఫిదా!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

