సిటీబ్యూరో: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మంగళవారం ఓల్డ్ అంబేద్కర్ జంక్షన్, నెక్లెస్‌రోడ్‌లోని అంబేద్కర్ స్కేర్ వద్ద నిర్వహించనున్న వేడుకల సందర్భంగా ఉదయం పది గంటల నుంచి రాత్రి 8 వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని ట్రాఫిక్ పోలీస్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ తెలిపారు. ముఖ్యంగా ఓల్డ్ పీఎస్ సైఫాబాద్ నుంచి లిబర్టీ జంక్షన్ మార్గంలో వాహనాలను ఇక్బాల్ మినార్ వద్ద రవీంద్రభారతి వైపు మళ్లిస్తారు.
ఇక్బాల్ మినార్ నుంచి లిబర్టీ మార్గంలో వాహనాలను అనుమతించకుండా తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ ప్రారంభం వద్ద ఫ్లైఓవర్ మీదుగా మళ్లిస్తారు. బషీర్‌బాగ్ నుంచి సెక్రటరియేట్ వాహనాలను హోప్ హాస్పిటల్ లేన్ వద్ద క్రిస్టల్ జంక్షన్, ఐటీ జంక్షన్ మీదుగా సెక్రటేరియట్ వైపు మళ్లిస్తారు. లిబర్టీ నుంచి ఓల్డ్ అంబేద్కర్ జంక్షన్వైపు వాహనాలను జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద సెక్రటేరియట్ జంక్షన్వైపు మళ్లిస్తారు. అప్పర్ ట్యాంక్‌బండ్ నుంచి లిబర్టీ వైపు వచ్చే వాహనాలను అంబేద్కర్ విగ్రహం వద్ద సెక్రటేరియట్ జంక్షన్ వైపు మళ్లిస్తారు.