Hyderabad Traffic | హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. నేటి నుండి ఉప్పల్ రింగ్ రోడ్ మూసివేత
Hyderabad Traffic | హైదరాబాద్ నగరవాసులకు అలర్ట్.. అత్యంత రద్దీగా ఉండే ఉప్పల్ రింగ్ రోడ్డు చౌరస్తాను నేటి నుంచి తాత్కాలికంగా మూసివేశారు. ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల కోసం మూడు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి.
Hyderabad Traffic | హైదరాబాద్ నగరవాసులకు అలర్ట్.. అత్యంత రద్దీగా ఉండే ఉప్పల్ రింగ్ రోడ్డు చౌరస్తాను నేటి నుంచి తాత్కాలికంగా మూసివేశారు. ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల కోసం మూడు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి.
రామంతాపూర్, హబ్సీగూడ నుంచి వరంగల్ వైపు వెళ్లే వాహనాలు పిస్తా హౌస్, లిటిల్ ఫ్లవర్ స్కూల్ వెనుక నుంచి బీరప్పగూడ మీదుగా వరంగల్ జాతీయ రహదారిని చేరుకునే మళ్లింపు చర్యలు చేపట్టారు. జీహెచ్ఎంసీ కార్యాలయం పక్కనున్న వరంగల్ బస్టాప్ను ఇప్పటికే నల్లచెరువు కట్ట వద్దకు మార్చిన సంగతి తెలిసిందే.
నాగోల్, ఎల్బీనగర్ వైపు నుంచి వరంగల్ వెళ్లే వాహనాలు హయత్నగర్ మీదుగా పెద్ద అంబర్పేట వద్ద ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుపై నుంచి లేదా సర్వీస్ రోడ్డు మార్గాన ఘట్కేసర్ వద్ద వరంగల్ జాతీయ రహదారికి చేరుకోనున్నాయి.
ఫీర్జాదిగూడ వైపు నుంచి సికింద్రాబాద్ వెళ్లే వాహనాలు ఉప్పల్ జంక్షన్ రాకముందు ఉన్న లక్ష్మారెడ్డి కాలనీ మీదుగా ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద ఉన్న మాస్టర్ చెఫ్ రెస్టారెంట్ చేరుకుని, అక్కడ యూటర్న్ తీసుకుని సికింద్రాబాద్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. ఫీర్జాదీగూడ నుంచి నాగోలు వెళ్లాంటే ఉప్పల్ భగాయత్ లేఅవుట్ ద్వారా చేరుకోవాల్సి ఉంటుంది. నాగోలు నుంచి వరంగల్ వైపు వాహనాలు కూడా భగాయత్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. హబ్సీగూడ నుంచి నాగోలు వైపు వెళ్లే వాహనాలకు ఎలాంటి ఆంక్షలు లేవు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

