వృద్ధుడికి సహాయకుడిగా ఉంటూ.. దోచేశాడు

సిటీబ్యూరో, జూన్ 11(నమస్తే తెలంగాణ): ఓ వృద్ధుడికి సహాయకుడిగా ఉంటూ.. అతని డెబిట్ కార్డు వివరాలను తెలుసుకొని డబ్బులు కొట్టేసిన ఓ యువకుడిని శుక్రవారం రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ క్రైం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఫలక్‌నుమా ప్రాంతానికి చెందిన వినయ్‌రెడ్డి నాగోల్‌లోని రామకృష్ణా వృద్ధాశ్రమంలో సహాయకుడిగా పని చేస్తున్నాడు. అతన్ని ఫిబ్రవరిలో చేరిన ఓ వృద్ధుడికి సహాయకుడిగా నిర్వాహకులు నియమించారు. ఈ క్రమంలో ఆ వృద్ధుడి డెబిట్‌కార్డు వివరాలు తెలుసుకుని.. దాని ద్వారా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, జొమాటో, తదితర ఈ-కామర్స్ వెబ్‌సైట్స్ నుంచి దాదాపు రూ.1.57 లక్షల షాపింగ్ చేశాడు. ఇటీవల ఈ విషయాన్ని గమనించిన వృద్ధుడు.. వృద్ధాశ్రమం నిర్వాహకులకు సమాచారం అందించి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా సాంకేతిక ఆధారాలను సేకరించిన పోలీసులు.. నిందితుడు వినయ్‌రెడ్డిని శుక్రవారం అరెస్ట్ చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- thief
- Thief Arrested
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

