పన్నులేస్తాం..పని చేయం!
‘ప్రజలపై పన్నులు విధిస్తాం.. కానీ దానికి సంబంధించిన సేవలను మాత్రం వినియోగదారులకు అందించం.
- విలీన మున్సిపాలిటీల్లో జలమండలి వింత ధోరణి
- మురుగు నిర్వహణ మున్సిపాలిటీలు చేస్తున్నా.. ‘సీవరేజీ ట్యాక్స్’
- ఒక్కో నల్లా కనెక్షన్‌కు 35 శాతం పన్ను విధిస్తున్న జలమండలి
- రూ. 2.50 లక్షల కుటుంబాల నుంచి ప్రతినెలా 1.75 కోట్ల వసూలు
- పాత బకాయిలు, పన్నులు విధిస్తుండటంతో ప్రజలపై అదనపు భారం
‘ప్రజలపై పన్నులు విధిస్తాం.. కానీ దానికి సంబంధించిన సేవలను మాత్రం వినియోగదారులకు అందించం. వినియోగదారుల నుంచి ప్రతి నెలా కోట్లాది రూపాయలు వసూలు చేస్తాం.. కానీ వారికి కనీస వసతులు కల్పించం. ఇండ్లలోంచి వెలువడుతున్న మురుగుకు ట్యాక్స్ విధిస్తాం.. కానీ ఆ మురుగును మాత్రం తొలగించం.
ఒకనెల బిల్లు చెల్లించకుంటే అన్ని సేవలను నిలిపేస్తాం.. తాగు నీళ్లు మాత్రం సకాలంలో చాలినన్ని సరఫరా చెయ్యం. చుక్క నీళ్లు వృథా చేసినా వేలాది రూపాయల జరిమానాలు విధిస్తాం.. కానీ మేం వసూలు చేస్తున్న పన్నులను వినియోగదారుల కోసం ఖర్చు చెయ్యం.’ విలీన మున్సిపాలిటీల్లోని గ్రామాలు, బస్తీలు, కాలనీల్లో జలమండలి తీరిది.
సిటీబ్యూరో, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం జలమండలిని జీహెచ్ఎంసీతో సమాంతరంగా తలాతోక లేకుండా చుట్టూ ఒక గీత గీసినట్లు విస్తరించింది. విస్తరణ జరిగి ఏడాది అవుతున్నా విలీన ప్రాంతాల్లో మాత్రం కనీస వసతులు కల్పించడం లేదు. ముఖ్యంగా జలమండలిలో విలీనం చేసుకున్న మున్సిపాలిటీల ప్రజలకు నరకం చూపిస్తున్నది. విలీన మున్సిపాలిటీల వినియోగదారులను జలమండలి అన్ని విధాలా తీవ్రంగా వేధిస్తున్నది. నీటి సరఫరా, ట్యాంకర్ల బుకింగ్స్, పెండింగ్ బకాయిలతో 2.5 లక్షల కుటుంబాల వినియోగదారులు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. ఔటర్ రింగ్‌రోడ్డు లోపలి, బయటి మున్సిపాలిటీల్లోని ఆయా ప్రాంతాల విలీన ప్రక్రియ పూర్తయినా..జలమండలి సేవలు మాత్రం అందడం లేదు. నల్లా బిల్లులతో పాటు ప్రతి నెలా 35 శాతం ట్యాక్స్ విధిస్తున్నారు.
రూ. 242 మినిమం బిల్లు వస్తుంటే అందులో రూ.70 సీవరేజీ ట్యాక్స్ కింద వసూలు చేస్తున్నారు. కానీ మురుగు నిర్వహణ మాత్రం మున్సిపాలిటీల మీదనే వదిలేశారు. ఇండ్లలో మురుగు సమస్య వచ్చినా… ఆయా కాలనీల్లో మ్యాన్ హోళ్లు పొంగిపొర్లుతున్నా జలమండలి అధికారులు పట్టించుకోవడం లేదు. మురుగు పొంగుతున్నదని ఫిర్యాదు చేస్తే తమ పరిధిలో లేదని.. మున్సిపాలిటీ వాళ్లకు చెప్పాలని చేతులు దులుపుకొంటున్నారు. మున్సిపాలిటీ సిబ్బంది సకాలంలో స్పందించకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.
ప్రతినెలా రూ.1.70 కోట్లు వసూలు
జలమండలిని కాంగ్రెస్ ప్రభుత్వం జీహెచ్ఎంసీతో సమాంతరంగా విస్తరించింది. అందులో భాగంగా వివిధ శివారు మున్సిపాలిటీల నుంచి 2.50 లక్షల కుటుంబాలు జలమండలి పరిధిలోకి వచ్చాయి. సీవరేజీ ట్యాక్స్ రూపంలో ప్రతి నెలా వారి నుంచి రూ.1.70 కోట్లు వసూలు చేస్తున్నది. కానీ వారికి మురుగు నిర్వహణ సేవలు మాత్రం అందించడం లేదు. మురుగు తొలగింపు పనులు చేయకుండా పన్నులు ఎలా వసూలు చేస్తారని ప్రశ్నిస్తే.. విలీన ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. అప్పటిదాకా మున్సిపాలిటీ నిర్వహిస్తుందని బదులిస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపలి మున్సిపాలిటీలను 2021లోనే విలీనం చేస్తున్నట్లు ఉత్తర్వులిచ్చారు.
అయినా ఇప్పటిదాకా ప్రక్రియ పూర్తి కాకపోవడం జలమండలి పనితీరుకు నిదర్శనంగా నిలుస్తున్నది. నీటి బిల్లులు వసూలు చేస్తున్నంత పకడ్బందీగా విలీన ప్రక్రియ ఎందుకు పూర్తి చేయడం లేదు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు ఓఆర్ఆర్ బయటి గ్రామాలు, మున్సిపాలిటీలు జలమండలి విస్తరణలో భాగంగా బోర్డు పరిధిలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఇప్పటిదాకా సేవలను విస్తరించకపోవడం విడ్డూరంగా ఉన్నది. విలీన మున్సిపాలిటీల్లో పాత బకాయిల పేరిట ట్యాంకర్ బుకింగ్ సేవలను పూర్తిగా నిలిపేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలకు సేవలందించడంలో అలసత్వం వహిస్తూ పన్నులు వసూలు చేయడంలో మాత్రం దూకుడుగా వ్యవహరించడ పట్ల తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

