Constable suciede | మూసారాంబాగ్ శాలివాహన నగర్లో మూసారాంబాగ్‌లో కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి స్థానికంగా కలకలం రేపింది. పోలీస్ కానిస్టేబుల్ ముత్తె చంద్రశేఖర్(35) ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. చంద్రశేఖర్ అంబర్పేట్ హెడ్‌క్వార్టర్స్‌లోనే రైటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా, అర్ధరాత్రి ఓ యువతికి వీడియో కాల్ చేసిన కానిస్టేబుల్ తాను ఉరివేసుకుంటున్నట్లు యువతికి చెప్పాడు.
వెంటనే సదరు యువతి చైతన్యపురి, మలక్‌పేట్ పోలీసులకు సమాచారమిచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న మలక్‌పేట్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది.