గాంధీలో బ్లాక్ ఫంగస్‌కు శస్త్ర చికిత్సలు

- ‘స్పెషల్ సర్జరీ డ్రైవ్’ చేపట్టిన వైద్యుల బృందం..
- ప్రతిరోజు 15 మందికి ఆపరేషన్ చేయాలని ప్రణాళిక
- అందుబాటులో వసతులు..
- ప్రస్తుతం గాంధీలో 206 మంది బ్లాక్ ఫంగస్ బాధితులకు చికిత్స
బన్సీలాల్‌పేట్, మే 29: కరోనా నోడల్ కేంద్రమైన గాంధీ దవాఖానలో శనివారం నుంచి బ్లాక్ ఫంగస్ బాధితులకు శస్త్ర చికిత్సలు చేసేందుకు ‘స్పెషల్ సర్జరీ డ్రైవ్’ చేపట్టారు. మొదటి రోజు 13 మంది బాధితులకు విజయవంతంగా ఆపరేషన్లు నిర్వహించారు. ప్రస్తుతం, దవాఖానలో 206 మంది బ్లాక్ ఫంగస్ బాధితులు చికిత్స పొందుతుండగా, పది రోజుల పాటు ప్రతిరోజు 15 నుంచి 20 మంది బాధితులకు ఆపరేషన్ చేయాలని ప్రణాళిక రూపొందించారు. ఇందుకు సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావు ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ డ్రైవ్ కోసం ప్రత్యేకంగా ఐదు విభాగాల వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈఎన్టీ విభాగం హెచ్ఓడీ డాక్టర్ శోభన్‌బాబు నేతృత్వంలో ఆప్తమాలజీ, డెంటల్, ఈఎన్టీ, న్యూరో, అనస్తీషియా విభాగాల వైద్యులు ఈ ప్రత్యేక డ్రైవ్‌లో సభ్యులుగా ఉంటారని ఆయన వెల్లడించారు.
మూడో అంతస్తులోని ఈఎన్టీ ఆపరేషన్ థియేటర్లో ఇందుకు మూడు సర్జరీ టేబుళ్ళను, ఇతర మౌలిక వసతులు, వైద్య పరికరాలు, కావలసిన నివారణ ఔషధాలు సమకూర్చినట్టు చెప్పారు. మొదటి దశలో బ్లాక్ ఫంగస్‌ను గుర్తిస్తే తగిన వైద్యం అందించడం ద్వారా చికిత్స సులభం అవుతుందని, వ్యాధి బాగా ముదిరి శరీరంలోని ఇతర అవయవాలకు సోకడంతో రోగి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుందన్నారు. అందుకే బాధితులకు తప్పనిసరిగా శస్త్ర చికిత్సలు చేయాల్సిన పరిస్థితి నెలకొన్నదని సీనియర్ వైద్యులు అభిప్రాయం వ్యక్తం చేశారని డాక్టర్ రాజారావు తెలిపారు. ఇదిలా ఉంటే గాంధీని డీఎంఈ డాక్టర్ రమేశ్ రెడ్డి సందర్శించారు. శనివారం 13 మందికి శస్త్ర చికిత్సలు నిర్వహించిన వైద్యుల బృందాన్ని ఆయన అభినందించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

