మెట్రోలో స్టూడెంట్ పాస్
విద్యార్థుల సౌకర్యార్థం హైదరాబాద్ మెట్రో రైలులో సూపర్ సేవర్ స్టూడెంట్ పాస్-2023ని జూలై 1 నుంచి అమల్లోకి తీసుకువచ్చామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో అధికారులు శనివారం స్టూడెంట్ పాస్ వివరాలను వెల్లడించారు.
- జూలై 1 నుంచి అందుబాటులోకి : మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
సిటీబ్యూరో, జూలై 1(నమస్తే తెలంగాణ): విద్యార్థుల సౌకర్యార్థం హైదరాబాద్ మెట్రో రైలులో సూపర్ సేవర్ స్టూడెంట్ పాస్-2023ని జూలై 1 నుంచి అమల్లోకి తీసుకువచ్చామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో అధికారులు శనివారం స్టూడెంట్ పాస్ వివరాలను వెల్లడించారు. మెట్రో ప్రయాణాన్ని మరింత మెరుగ్గా ఆస్వాదించాలని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. 1998 ఏప్రిల్ 1 తర్వాత పుట్టిన విద్యార్థులంతా ఈ పాస్ పొందేందుకు అర్హులని, ఈ ఆఫర్ కింద విద్యార్థులు 20 ట్రిప్పులకు మాత్రమే చెల్లించి, అన్ని ఫేర్ జోన్లలో 30 ట్రిప్పుల వరకు ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. కాగా, విద్యార్థులు తప్పనిసరిగా కొత్త బ్రాండెడ్ స్మార్ట్ కార్డు కొనుగోలు చేయాలన్నారు. ఒక విద్యార్థికి ఒక స్మార్ట్ కార్డ్ మాత్రమే జారీ చేస్తారని, అది కొనుగోలు చేసిన తేదీ నుంచి 30 రోజుల వరకు చెల్లుబాటు అవుతుందని ఎల్ అండ్ టీ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి తెలిపారు. ఈ ఆఫర్ జూలై 1 నుంచి ప్రారంభమై వచ్చే ఏడాది (2024) మార్చి వరకు 9 నెలలు మాత్రమే అందుబాటులో ఉంటుందన్నారు. విద్యార్థులు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య పలు మెట్రో స్టేషన్లలో పాస్‌లను కొనుగోలు చేయాలని సూచించారు. ఈ జాబితాలో రెడ్ లైన్లో జేఎన్టీయూ కాలేజ్, ఎస్ఆర్ నగర్, అమీర్‌పేట, విక్టోరియా మెమోరియల్, దిల్సుఖ్నగర్, గ్రీన్ లైన్లో నారాయణగూడ, బ్లూ లైన్లో నాగోల్, పరేడ్ గ్రౌండ్, బేగంపేట, అమీర్‌పేట, రాయదుర్గం మెట్రో స్టేషన్లలో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సూపర్ సేవర్ మెట్రో పాస్‌లను కొనుగోలు చేసిన విద్యార్థులకు హైదరాబాద్ మెట్రో రైలుతో అనుసంధానం గల రిలయన్స్ ట్రెండ్స్, 24 సెవన్స్ కన్వీనియన్స్ స్టోర్ వంటి వాణిజ్య సంస్థల ద్వారా రాయితీ కూపన్లు పొందవచ్చని, వివరాలకు (www.ltmetro.com) మెట్రో వెబ్సైట్లో సంప్రదించాలన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
Madaram dispensary | మాదారం డిస్పెన్సరీ తరలింపు కుట్రను అడ్డుకుంటాం : మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
Pawan Kalyan | చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు రోడ్లపైకి వచ్చింది జనసైనికులే!.. కూటమిలో జనసేనదే ఎక్కువ త్యాగం.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

