ఉన్నత విద్య కోసం ఇటలీ వెళ్లిన హైదరాబాదీ.. అనుమానాస్పద స్థితిలో మృతి
hyderabad | ఉన్నత విద్య కోసం ఇటలీ వెళ్లిన ఓ హైదరాబాదీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కుమారుడు చనిపోయాడన్న వార్త తెలుసుకుని అతని తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. తమ
హైదరాబాద్ : ఉన్నత విద్య కోసం ఇటలీ వెళ్లిన ఓ హైదరాబాదీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కుమారుడు చనిపోయాడన్న వార్త తెలుసుకుని అతని తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. తమ బిడ్డ మృతదేహాన్ని వీలైనంత త్వరగా హైదరాబాద్‌కు తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను తల్లిదండ్రులు కోరారు.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని పద్మారావు నగర్‌కు చెందిన పీ రామచంద్ర(రిటైర్డ్ రైల్వే ఎంప్లాయ్), రాజేశ్వరి దంపతుల కుమారుడు పీ ఉదయ్ కుమార్(28) ఉన్నత విద్యను అభ్యసించేందుకు 2018లో తొలిసారిగా ఇటలీకి వెళ్లాడు. రోమ్‌లోని ఓ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ విద్యను అభ్యసిస్తున్నాడు. కరోనా మహమ్మారి కారణంగా 2020లో హైదరాబాద్‌కు తిరిగి వచ్చేశాడు. కరోనా వ్యాప్తి తగ్గడంతో 2021లో మళ్లీ ఇటలీ వెళ్లాడు. రోమ్‌లో తన స్నేహితులతో కలిసి ఉంటున్నాడు.
అయితే నవంబర్ 4వ తేదీన ఉదయ్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు తల్లిదండ్రులకు మెయిల్ వచ్చింది. అసలేం జరిగిందనే విషయం తెలుసుకునేందుకు స్నేహితులకు, తెలిసిన వారికి కాల్ చేయగా, సరైన సమాచారం లభించలేదు.
ఈ క్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను రామచంద్ర, రాజేశ్వరి కలిశారు. తమ బిడ్డ మృతదేహాన్ని వీలైనంత త్వరగా హైదరాబాద్‌కు తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలని కోరారు. ఉదయ్ కుమార్ మృతికి గల కారణాలను తెలుసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. అలాగే డెడ్ బాడీని కూడా వీలైనంత త్వరగా హైదరాబాద్‌కు తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇటలీలోని ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడుతానని చెప్పారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bihar MLA Anant Singh | కుమార్తె పెళ్లి సందర్భంగా గుర్రపు పోటీలు.. విజేతకు ‘థార్’ బహుకరించనున్న ఎమ్మెల్యే
Harihara Putra | అయ్యప్ప భక్తి నేపథ్యంలో వైభవ్ ‘హరిహర పుత్ర’.. ఆకట్టుకుంటున్న టీజర్!
Komatireddy Rajagopal Reddy | ఖబడ్దార్ బిడ్డా యుద్దం స్టార్ట్ అయితది.. రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాస్ వార్నింగ్
Donald Trump: ట్రంప్‌ను హత్తుకున్న జిన్‌పింగ్.. చైనాకు ఎన్విడియా చిప్స్ బంద్
Dogra Front | లష్కరే ఉగ్రవాది ఎన్కౌంటర్.. జమ్ముకశ్మీర్‌లో డోగ్రా ఫ్రంట్ సంబురాలు.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి

