30వ అంతస్తు నుంచి పడి టెక్కీ మృతి
నానక్‌రాంగూడలోని గోల్ప్ ఎడ్జ్ అపార్టుమెంట్‌లోని 30వ అంతస్తు నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగి పడి దుర్మణం చెందాడు. రెండు రోజుల కిందటే ఈ అపార్ట్మెంట్లో ఓ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్న ఉప్పల భరత్(29) సూర్యాపేట జిల్లా వాసిగా గచ్చిబౌలి పోలీసులు గుర్తించారు.
సిటీబ్యూరో, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ) : నానక్‌రాంగూడలోని గోల్ప్ ఎడ్జ్ అపార్టుమెంట్‌లోని 30వ అంతస్తు నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగి పడి దుర్మణం చెందాడు. రెండు రోజుల కిందటే ఈ అపార్ట్మెంట్లో ఓ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్న ఉప్పల భరత్(29) సూర్యాపేట జిల్లా వాసిగా గచ్చిబౌలి పోలీసులు గుర్తించారు.బెంగుళూరులోని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌కు వచ్చినట్లుగా గుర్తించారు. ఈ ఘటనకు రెండు రోజుల ముందే అతడు కొత్త ఫ్లాట్‌లోకి మారడం గమనార్హం. సోమవారం జరిగిన ఈ ఘటనలో భరత్ కింద ఉన్న పార్కింగ్ ఏరియాలోని వాహనంపై పడి తీవ్ర గాయాలు కాగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి బంధువు ఉప్పల కిషోర్ ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

