అప్పుల నుంచి బయటపడేందుకు.. స్నాచింగ్ డ్రామా

- అసలు గొలుసును గిరివి పెట్టి.. ఇంట్లోవారి దృష్టి మళ్లించేందుకు నాటకం
- సీసీ కెమెరాల్లో బయటపడిన నిజం
సిటీబ్యూరో, జులై 1(నమస్తే తెలంగాణ): అప్పుల నుంచి తప్పించుకునేందుకు ఓ మహిళ స్నాచింగ్ డ్రామా ఆడింది. పోలీసుల దర్యాప్తులో అది కట్టుకథ అని తేలింది. ఈ సంఘటన ఎల్బీనగర్ పీఎస్ పరిధిలో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే…ఎల్బీనగర్ ఎస్బీహెచ్ కాలనీకి చెందిన ఓ మహిళ.. గత నెల 28న రాత్రి 8.30 గంటలకు గొలుసు దొంగతనం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరాలను పరిశీలించారు.. అక్కడ స్నాచింగ్ జరిగిన దృశ్యాలు కనపడలేదు… అయితే.. అప్పుడు ఆ మహిళ సాఫీగా నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యం కనపడింది.. అలాగే.. ఆమె ఇంటి నుంచి బయలుదేరిన ప్రాంతం నుంచి..తిరిగి ఇంటికి చేరుకున్న ప్రాంతం మొత్తం సీసీ కెమెరాలను పరిశీలించారు.. అక్కడ ఎక్కడ కూడా స్నాచింగ్ జరిగిన దృశ్యాలు కనపడలేదు.. దీంతో ఆ మహిళను అదుపులోకి తీసుకుని నిలదీయగా… స్నాచింగ్ జరగలేదని తేలింది. తనకు అప్పులు అయ్యాయని, వాటి నుంచి బయటపడేందుకు బంగారాన్ని ఓ పాన్ బ్రోకర్ వద్ద గిరివి పెట్టానని … ఈ విషయం ఇంట్లో వాళ్లకు తెలిస్తే గొడవలు జరుగుతాయని భావించి.. వాటిని నుంచి తప్పించుకునేందుకు స్నాచింగ్ డ్రామా ఆడినట్లు ఒప్పుకుంది. ఈ తప్పుడు ఫిర్యాదుతో పోలీసులు రెండు రోజుల పాటు కలవరానికి గురై.. ఉరుకులు, పరుగులు పెట్టారు. ఫిర్యాదు తప్పని తేలడంతో.. బాధిత మహిళపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Chain snatching
- Snatching
RELATED ARTICLES
తాజా వార్తలు
ఇద్దరు పిల్లలతో తల్లి బలవన్మరణం
గిరిజన భూములు పరిరక్షించాలి.. రౌండ్‌టేబుల్ సమావేశంలో ఏపీ, తెలంగాణకు వక్తల విజ్ఞప్తి
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ఆందోళనకారులేమన్నా చంబల్ దోపిడీ దొంగలా?.. ప్రశ్నించిన దీప్కే తల్లిదండ్రులు
సర్‌ను రద్దు చేయాల్సిందే.. కొత్తగూడెం, అచ్చంపేటలో ఉపాధ్యాయుల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

