బాలుర సదనం నుంచి ఆరుగురు పరార్
సైదాబాద్, ఆగస్టు 8 : సైదాబాద్ బాలుర సదనం (బాలల సంక్షేమ, సంస్కరణల వీధి బాలల సంక్షేమ సదనం-జువైనల్ హోం) నుంచి ఆదివారం సాయంత్రం 6 గురు బాలురు పరారయ్యారు. సదనం (హోం) గేట్ వద్ద కాపలాగా ఉన్న సూపర్వైజర్ను బలవంతంగా నెట్టివేసి, ఆతనిపై దాడిచేసి పరారయ్యారు. బీహార్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాలకు చెందిన పదిమంది బాలురు పథకం ప్రకారం సాయంత్రం 5 గంటల సమయంలో లాకప్ చేసేటప్పడు వారందరు ఒక్కసారిగా గేట్ వద్ద కాపలగా ఉన్న సూపర్వైజర్ ఖదీర్‌ను నెట్టివేసి ఆతనిపై దాడిచేయటంతో కిందపడి పడిపోగానే వారందరు రోడ్ల వెంట పరుగులు పెట్టారు. రోడ్లపై పారిపోతున్న వారిలో స్థానికుల సహాయంతో హోం సిబ్బంది 4గురిని పట్టుకోగా మిగతా ఆరుగురు పరారయ్యారు. తీవ్రంగా గాయపడ్డ సూపర్వైజర్ను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. పారిపోయిన వారి ఆచూకీ కోసం హోం సిబ్బంది సీసీ కెమెరా పుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా బీహార్,ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాలకు చెందిన బాలురు నగరంలో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తుండగా వారం రోజుల క్రితం అధికారులు, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న బాలలను గుర్తించి వారికి విముక్తి కల్పించి సైదాబాద్ బాలుర సదనంకు తరలించారు. బాలుర సదనం పర్యవేక్షణాధికారి ఎన్. నాగేశ్వర్రావు సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తప్పించుకున్న బాలుర కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bengaluru Techie’s Kidnap | టెక్కీ కిడ్నాప్ కేసులో 11 మంది అరెస్ట్.. అతడు అత్యాచారానికి పాల్పడినట్లు కిడ్నాపర్ మహిళ ఫిర్యాదు
Tirumala | తిరుమలలో నీటి ఎద్దడి రాకుండా పటిష్ట చర్యలు.. 150 రోజులకు సరిపడా నీటి నిల్వలు : టీటీడీ
Water Tanker | హైదరాబాద్ రోడ్లపై.. వాటర్ ట్యాంకర్లో నుంచి వృధాగా పోతున్న నీళ్లు.. వీడియో
Case Register | రైస్‌మిల్‌లో రూ.13.77 కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయం.. మిల్లు భాగస్వాములపై కేసు నమోదు
Premayanam | ఓటీటీలో అదరగొడుతున్న ‘ప్రేమాయణం’ వెబ్ సిరీస్.. ఆకట్టుకుంటున్న బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

