సిటీబ్యూరో, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ) : ఆర్టీఏ కార్యాలయాల్లో సర్వర్ డౌన్‌తో పలు సేవలకు సంబంధించిన లావాదేవిలు గురువారం నిలిచిపోయాయి. దీంతో వాహన సేవలు ఆగిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
నగరంలోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వాహనదారులు వెనుతిరిగారు. స్లాట్స్ బుకింగ్లోనూ సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో కార్యాలయాల్లో కొన్ని గంటల పాటు సిబ్బంది ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.