ఇంటివద్దే అడ్మిషన్లు.. అక్కడే పుస్తకాలు

- సర్కారు విద్యార్థుల ఇండ్ల వద్దకు ఉపాధ్యాయ బృందాలు
- ఆగస్టు నుంచి ప్రైమరీ విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు
మేడ్చల్, జూలై 28 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఇంటి వద్దకు వెళ్లి పాఠపుస్తకాలను అందిస్తున్నారు. నూతనంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల అడ్మిషన్ల ప్రక్రియను ఇంటివద్దేనే కొనసాగిస్తున్నారు.మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు జిల్లా విద్యాశాఖ ఆదేశాల మేరకు ఉపాధ్యాయుల బృందాలు ఇంటి వద్దకే వెళ్లి పాఠ్యపుస్తకాలు, అడ్మిషన్లను తీసుకోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి ఉప్పల్ నియోజకవర్గాల్లో 505 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి.
ఇందులో 68 వేల 125 మంది విద్యార్థులు చదువుతున్నారు. 80 శాతం మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీని పూర్తి చేశారు. మిగతా విద్యార్థులకు త్వరలోనే పుస్తకాలను అందజేయనున్నారు. ఆన్లైన్లో ప్రతిరోజూ 47.727 మందికి పైగా తరగతులకు హాజరవుతున్నారు. ఆన్లైన్ తరగుతులను వినేలా విద్యార్థులను ఉపాధ్యాయులు పర్యవేక్షిస్తూ పాఠాలు వినేలా ప్రొత్సహిస్తున్నారు. ప్రైమరీ పాఠశాలల విద్యార్థులకు ఆగస్టు నుంచి ఆన్లైన్లో తరగతులను నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు.
80 శాతం పుస్తకాల పంపిణీ పూర్తి
ఇంటివద్దకు ఉపాధ్యాయులు వెళ్లి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందిస్తూ, పాఠశాలలో చేరే నూతన విద్యార్థుల అడ్మిషన్లను తీసుకుంటున్నారు. ఆన్లైన్లో హాజరుశాతం పెరిగింది. 80 శాతం పుస్తకాల పంపిణీ పూర్తయింది. ఎన్.ఎస్.ఎస్ ప్రసాద్, జిల్లా విద్యాధికారి
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- school admission
RELATED ARTICLES
తాజా వార్తలు
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

