అతివలకు రక్షణేది
నవంబర్‌లో నగరంలోని జూబ్లీహిల్స్ జోన్‌లోని ఓ పోలీసుస్టేషన్ పరిధిలో ఎయిర్‌హోస్టెస్ శిక్షణ పొందుతున్న ఇద్దరు బాలికలను ఇద్దరు యువకులు పార్టీకి ఆహ్వానించి బాలానగర్‌లోని ఒక గదికి తీసుకెళ్లినట్లు పోలీసులు చెప్పారు. మద్యం తాగించేందుకు బలవంతం చేసి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాలికలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు పెట్టారు.
-
మితిమీరుతున్న పోకిరీల ఆగడాలు
-
11 నెలల్లో 10వేల మంది ఆకతాయిల గుర్తింపు
-
మూడేండ్లలో మూడింతలు పెరిగిన వేధింపుల కేసులు
-
నగరంలో విపరీతంగా రెచ్చిపోతున్న పోకిరీలు
నగరంలో పోకిరీలు రెచ్చిపోతుండటంతో అతివలకు రక్షణ కరవవుతున్నది. వయసుతో సంబంధం లేకుండా.. మహిళలు కనిపిస్తే చాలు.. ప్రబుద్ధులు వెకిలిచేష్టలు చేస్తూ..వేధింపులకు పాల్పడుతున్నారు. రోడ్లపై వెళ్తున్న క్రమంలో టీజ్ చేయడం.. వెంటపడి విసిగించడం.. కొన్ని సందర్భాల్లో అసభ్యకరంగా ప్రవర్తించడం వంటివి చేస్తున్నారు. మూడేండ్లలో వేధింపులకు సంబంధించిన కేసులు మూడింతలు పెరిగిపోవడం ఆందోళన కలిగించే అంశం. ఈ ఏడాది 11 నెలల్లో పదివేల మందికిపైగా ఆకతాయిలను పోలీసులు పట్టుకున్నారంటే.. పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతున్నది.
మూడేండ్లలో పెరిగిన పోకిరీలు
నాలుగు సంవత్సరాలుగా నగరంలో మహిళలను వేధిస్తున్న వారిపై నమోదవుతున్న కేసుల సంఖ్య చూస్తే ఏయేడుకాయేడు పెరిగిపోయాయి. ముఖ్యంగా మూడేండ్లుగా ఈ సంఖ్య మూడింతలైనట్లు గణాంకాలు చెబుతున్నాయి.
సిటీబ్యూరో, నవంబర్ 11(నమస్తే తెలంగాణ): నవంబర్‌లో నగరంలోని జూబ్లీహిల్స్ జోన్‌లోని ఓ పోలీసుస్టేషన్ పరిధిలో ఎయిర్‌హోస్టెస్ శిక్షణ పొందుతున్న ఇద్దరు బాలికలను ఇద్దరు యువకులు పార్టీకి ఆహ్వానించి బాలానగర్‌లోని ఒక గదికి తీసుకెళ్లినట్లు పోలీసులు చెప్పారు. మద్యం తాగించేందుకు బలవంతం చేసి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాలికలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు పెట్టారు.
- చార్మినార్ ప్రాంతంలో పశ్చిమబెంగాల్‌కు చెందిన ఓ నటి తన కుటుంబంతో కలిసి షాపింగ్ చేస్తుండగా, ఓ వ్యక్తి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదు నమోదైంది. చార్మినార్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా జైలుశిక్ష పడింది.
- నగరంలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని క్యాబ్ నుంచి దిగుతున్న సమయంలో సమీపంలోని హాస్టల్లో పనిచేస్తున్న ఓ ప్రైవేటు సెక్యూరిటీ గార్డు ఆమెను బలవంతంగా పట్టుకుని వేధించినట్లు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు మాత్రం ఆమె కిందపడకుండా పట్టుకున్నానని పోలీసులకు చెప్పినట్లు వారు చెప్పారు.ఇవి ప్రత్యేకంగా ఘటనలే కాగా నగరంలో జరిగే ఉత్సవాలు, వేడుకలు, పండుగలలో మహిళలు, యువతులు, బాలికలకు పోకిరీలతో వేధింపులు విపరీతమయ్యాయి. ఈ సంవత్సరం జనవరిలో నుమాయిష్‌లో మహిళలను వేధించిన 264 మందిని షీటీమ్స్ గుర్తించాయి. ఆగస్టులో జరిగిన బోనాలలో 678 మంది ఆకతాయిలను పోలీసులుపట్టుకోగా,122ఫిర్యాదులందాయి.సెప్టెంబర్ 14 నుంచి 23 వరకు జరిగిన గణేశ్ ఉత్సవాల్లో 1530 మందిని పట్టుకోగా, 724 మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు. అదే సమయంలో సీసీఎస్ తనిఖీలలో 1917 మందిసెప్టెంబర్ నెలలో మహిళల పట్ల అసభ్య ప్రవర్తనకు సంబంధించి 3068మందిని పట్టుకోగా 106 కేసులు నమోదు చేశారు. గత మూడేళ్లలో ఈ వేధింపులకు సంబంధించి నమోదైన కేసులు మూడింతలకు చేరుకున్నాయి. కేవలం ఈ సంవత్సరం నవంబర్ వరకు పదివేల మందికిపైగా ఆకతాయిలను పోలీసులు పట్టుకోగా ఇందులో ఐదువేలకు పైగా నమోదైన కేసులు ఆకతాయిల వేధింపుల తీవ్రతకు అద్దంపడుతున్నాయి.
ప్రతీరోజూ 10 నుంచి 15 మంది..!
హైదరాబాద్ నగరంలో ఆడపిల్లలకు పోకిరీలనుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. నగరంలో మహిళలు, యువతులు.. వయసుతో సంబంధం లేకుండా వేధింపులకు గురవుతున్నారు. మహిళలైతే చాలు.. వారిని వేధించడం ఆ ప్రబుద్ధులకు అలవాటుగా మారింది. రోడ్డుపై వెళ్తున్న క్రమంలో టీజ్ చేయడం, వెంటపడి వారిని విసిగించడం, కొన్ని సందర్భాల్లో వెకిలిచేష్టలతో సతాయిస్తున్నట్లుగా పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి.
ట్యాంక్‌బండ్ పరిసరప్రాంతాల్లో ఈ వేధింపులు మరీ ఎక్కువగా ఉంటున్నాయని పోలీసులే చెప్పారు. సోషల్‌మీడియా, బహిరంగ ప్రదేశాల్లో ఆకతాయిల వేధింపులపై నెలకు 600కుపైగా ఫిర్యాదులు వస్తున్నట్లు పోలీసులు చెప్పారు. షీటీమ్స్ నిఘాతో రోజుకు 10-15మంది పట్టుబడుతున్నారు. పోకిరీల వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోవాలని, వారు పట్టుబడితే సాక్ష్యాలతో కౌన్సెలింగ్ ఇవ్వడమే కాకుండా వారిపై హిస్టరీ షీట్ కూడా ఓపెన్ చేయమని సీపీ సజ్జనార్ గతంలోనే ఎస్హెచ్ఓలను ఆదేశించారు.

ఉద్యోగాలు పోవడం ఖాయం.!
సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న రద్దీ ప్రాంతాలు, మెట్రో స్టేషన్లు, సినీమాల్స్ వద్ద ఆకతాయిల వేధింపులకు సంబంధించి పోలీసులు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. వేధింపులకు పాల్పడే వారికి అడ్డుకట్ట వేసే క్రమంలో కేసులు, కౌన్సెలింగ్‌కే పరిమితం కాకుండా ఆ ప్రబుద్ధులు పనిచేసే కంపెనీలకు కూడా సమాచారమిస్తున్నారు.
ఇటీవల నగరంలో వినాయక ఉత్సవాలు, బోనాలు, ఊరేగింపుల్లో యువతులు, మహిళలతో అసభ్యంగా, అనుచితంగా ప్రవర్తించిన 6వేల మందిని పోలీసులు పట్టుకున్నారు. వీరిలో ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగులు, వృద్ధులు, మైనర్లు ఉన్నారు. కొంతమందిపై కేసులు నమోదు చేయగా మరికొందరికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించినా కొందరి అసభ్య ప్రవర్తన నేపథ్యంలో వారు పనిచేస్తున్న కంపెనీలు, శాఖలకు సమాచారమందించారు. దీంతో కేసులు నమోదైన కొందరు ఆకతాయి ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నతాధికారులు మెమోలు జారీ చేయగా, ప్రైవేటు ఉద్యోగుల్లో 26మందిని కంపెనీల నుంచి తొలగించినట్లు తెలిసింది.
(సంవత్సరం కేసుల సంఖ్య)
2022- 1268
2023- 1200
2024 -2625
2025- 4300
2026(నవంబర్) 5000
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

