ఆడపడుచే ప్రాణం తీసింది… వీడిన శిరీష హత్య కేసు మిస్టరీ
అనుమానాస్పద స్థితిలో మరణించిన శిరీషను ఆడపడుచే హత్య చేసిందని పోలీసులు నిర్ధారించారు. బుధవారం చాదర్‌ఘాట్ ఇన్స్పెక్టర్ రాజు, డీఐ భూపాల్‌గౌడ్, ఎస్ఐ రవిరాజ్లతో కలిసి సౌత్ ఈస్ట్‌జోన్ మలక్‌పేట డివిజన్ ఏసీపీ శ్యాంసుందర్ ఈ ఘటన వివరాలు వెల్లడించారు.
- వీడిన శిరీష హత్య కేసు మిస్టరీ
మలక్‌పేట: అనుమానాస్పద స్థితిలో మరణించిన శిరీషను ఆడపడుచే హత్య చేసిందని పోలీసులు నిర్ధారించారు. బుధవారం చాదర్‌ఘాట్ ఇన్స్పెక్టర్ రాజు, డీఐ భూపాల్‌గౌడ్, ఎస్ఐ రవిరాజ్లతో కలిసి సౌత్ ఈస్ట్‌జోన్ మలక్‌పేట డివిజన్ ఏసీపీ శ్యాంసుందర్ ఈ ఘటన వివరాలు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా పరకాలకు చెందిన శిరీష (32) కు చిన్నతనం(ఐదేండ్ల వయస్సు)లోనే తల్లిదండ్రులు చనిపోవటంతో ఆమెను ఒక ప్రొఫెసర్ దత్తత తీసుకొని పెంచి పెద్దచేశారు. ఆ తర్వాత శిరీష వారి వద్ద నుంచి వెళ్లొచ్చి బయటనే ఉంటూ బీఎస్సీ నర్సింగ్ చేసింది.
పదేళ్లుగా వివిధ ఆస్పత్రులలో నర్సుగా విధులు నిర్వర్తించింది. నాగర్‌కర్నూల్ జిల్లా సున్నిపెంట చెందిన వినయ్ ఓ ఆస్పత్రిలో రిసెప్షనిస్టుగా అతని సోదరి సరిత 2016లో ఒకే ఆస్పత్రిలో ఉద్యోగిగా విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో సదరు ఆస్ప్రతిలో నర్సుగా చేరిన శిరీషకు సరితతో సాన్నిహిత్యం పెరిగింది. సరిత తన తమ్ముడికి నచ్చజెప్పి శిరీషను ఒప్పించి 2016లో(తొమ్మిదేండ్ల క్రితం) అన్నీ తానై ఇద్దరికి పెళ్లి జరిపించింది. ప్రస్తుతం వీరికి రెండేండ్ల కూతురు కూడా ఉంది. పళ్లైన నాటినుంచి వినయ్, శిరీష దంపతులు మలక్‌పేటలోని జమునా టవర్స్‌లో నివాసం ఉంటున్నారు.
సరిత భర్త విదేశాల్లో ఉండడంతో ఆమె కూడా వీరిద్దరితోనే అదే ఇంట్లో నివాసం ఉంటున్నది. అయితే ఇటీవల నర్సుగా పని మానేసి ఇంటి వద్ద ఉంటున్న శిరీషను సరిత మందలించింది. పదే పదే ఉద్యోగం వదులుకోవడం తగదంటూ ఘర్షణ పడింది. ఇటీవల సరిత, శిరీషల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 2 శనివారం అర్ధరాత్రి 11.30 గంటలకు సరిత-శిరీషలు గొడవ పడి కొట్టుకున్నారు. శిరీషను సరిత తీవ్రంగా గాయపరిచింది.
కాస్త సద్దుమణిగాక తనకు అస్వస్థతగా ఉందని చెప్పిన శిరీషకు… సరిత తాను వాడుకునే మత్తుమందును అధిక మోతాదులో శిరీషకు ఇచ్చింది. దీంతో శిరీష మత్తులోకి జారుకుంది. ఇదే అదునుగా శిరీషకు ఊపిరి ఆడకుండా సరిత దిండు అదిమి ప్రాణం పోయేలా చేసింది. ఈ విషయాన్ని మరుసటి రోజు ఉదయం తమ్ముడు వినయ్‌కు చెప్పింది. ఇదంతా తెలుసుకున్న వినయ్ అక్కను కాపాడే ప్రయత్నంలో శిరీషకు గుండెపోటు వచ్చిందంటూ చెప్పి ఓ ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లి అది సహజ మరణమేనని నమ్మించాడు. అక్కడి నుంచి అంబులెన్స్ మాట్లాడి శిరీష మృతదేహాన్ని సున్నిపెంటకు తరలించే ప్రయత్నం చేశాడు.
ఇంత హడావుడిగా అంబులెన్స్‌ను తీసుకెళ్లే ప్రయత్నంపై శిరీష మేనమామ మధుకర్‌కు అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి అంబులెన్స్‌ను వెనక్కి పిలిపించి పోస్టుమార్టం చేయిస్తే అసలు బండారమంతా బయటపడింది. శిరీషకు ఊపిరాడకుండా చేసి చంపివేసి ఉంటారని పోస్టుమార్టం చేసిన వైద్యులు వెల్లడించడంతో వినయ్, సరితలను పోలీసులు విచారించారు. ఈ హత్యకు తానే పాల్పడినట్లు సరిత ఒప్పుకున్నదని పోలీసులు తెలిపారు. కాగా ఈ కేసులో సరిత, వినయ్‌లతో పాటు భిట్టు అనే మరో నిందితుడిపై కూడా హత్యకు సంబంధించిన కసులు పెట్టారు. మరింత లోతైన విచారణ చేస్తున్నామని ఏసీపీ తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Patnam Narender Reddy | అసమర్ధతను కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ కుటుంబంపై తిట్ల రాజకీయాలు : మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి
‘‘ప్రజా గర్జన – ఛలో హైదరాబాద్’ ని జయప్రదదం చేయండి’
‘ఆదివాసీ యువకుడు తెల్లం శరత్ మృతి ఘటనపై సమగ్ర విచారణ జరపాలి’
ACB Net | రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ వార్డు ఆఫీసర్
‘పున్న కైలాష్ బహిరంగ క్షమాపణ చెప్పాలి’
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

