రాంకీపై ఆగ్రహం.. చెత్త సేకరణపై ఎంఎంసీ కమిషనర్ కన్నెర్ర
కంప్యూటర్ తెరపై చూస్తే గ్రాండ్ సీన్.. ఆన్లైన్ నివేదికల్లో అంతా క్లీన్! కానీ తీరా క్షేత్రస్థాయిలోకి వెళ్తే వీధులన్నీ చెత్తమయం. రాంకీ సంస్థ కాగితాల (డ్యాష్ బోర్డ్) నివేదికలకు, రోడ్లపై ఉన్న వాస్తవ పరిస్థితులకు అస్సలు పొంతన కుదరడం లేదని స్వయంగా ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి పరిశీలనలోనే తేలడం లోపాలకు అద్దం పడుతున్నది. చె
- ఆన్లైన్లోనే పరిశుభ్రత.. క్షేత్రస్థాయిలో కానరాని స్వచ్ఛత
- ఆదర్శ్‌నగర్ ఆకస్మిక తనిఖీల్లో అనేక లోపాలు వెలుగులోకి
- సమీక్ష హాల్ నుంచి నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లిన వినయ్ కృష్ణా రెడ్డి
- ఇకపై ప్రతిరోజూ ఉదయంస్వయంగా పర్యటిస్తానని కమిషనర్ వెల్లడి
సిటీబ్యూరో, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): కంప్యూటర్ తెరపై చూస్తే గ్రాండ్ సీన్.. ఆన్లైన్ నివేదికల్లో అంతా క్లీన్! కానీ తీరా క్షేత్రస్థాయిలోకి వెళ్తే వీధులన్నీ చెత్తమయం. రాంకీ సంస్థ కాగితాల (డ్యాష్ బోర్డ్) నివేదికలకు, రోడ్లపై ఉన్న వాస్తవ పరిస్థితులకు అస్సలు పొంతన కుదరడం లేదని స్వయంగా ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి పరిశీలనలోనే తేలడం లోపాలకు అద్దం పడుతున్నది. చెత్త నిర్వహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న రాంకీ ఆన్లైన్ నివేదికల లోపాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన మలాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి పనితీరు మార్చుకోవాలని మందలింపుతో సరిపెట్టడం గమనార్హం.
సమీక్షల్లో భాగంగా శుక్రవారం ఉన్నతాధికారులు, రాంకీ సంస్థ ప్రతినిధులతో పారిశుధ్య నిర్వహణను అడిగి తెలుసుకున్నారు. మీటింగ్ హాల్ నుంచి సో నేరుగా ఉప్పల్ పరిధిలోని ఆదర్శ్‌నగర్‌కు వెళ్లి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. చెత్త సేకరణ వాహనాల జీపీఎస్ కో ఆర్డినేట్లు, వాహనాల రూట్లు, ట్రిప్పులు, గార్బేజ్ వల్నరబుల్ పాయింట్ల (జీపీవీ) క్లియరెన్స్ ఆన్ లైన్ నివేదికలను పరిశీలించారు. అయితే నివేదికల్లో చూపిస్తున్న లెకలకు, క్షేత్రస్థాయి పనులకు తేడా ఉండటంతో అధికారులతో కలిసి వెంటనే ఆదర్శ్ నగర్ చెత్త హాట్ స్పాట్‌ను సందర్శించారు. తనిఖీల్లో రాంకీ సిబ్బంది అనేక లోపాలు వెలుగు చూశాయి. ఒకే ప్రాంతంలో తీసిన ఫొటోలను వేర్వేరు జీపీవీ పాయింట్లలో అప్లోడ్ చేసి, శుభ్రం చేసినట్లు డ్యాష్ బోర్డ్‌లో చూపిస్తున్న తీరుపై కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కంటితుడుపుగా చిన్న చిన్న పాయింట్లు శుభ్రం చేసి, ప్రధాన హాట్ స్పాట్లను వదిలేయడంపై మండిపడ్డారు. ప్రతి జీపీవీ, హాట్ స్పాట్‌ను జీపీఎస్ కోఆర్డినేట్లతో మ్యాపింగ్ చేసి, ప్రత్యేక నంబర్ కేటాయించాలని సూచించారు.
కేవలం ఫొటోలు అప్లోడ్ చేస్తే సరిపోదని, ప్రాంతం పూర్తిగా శుభ్రపడితేనే క్లియరెన్స్ కింద నమోదు చేయాలన్నారు. తప్పుడు నివేదికలు ఇస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సరిపడా వాహనాలు ఏర్పాటు చేసి, రోజూ జీపీవీలను క్లియర్ చేయాలని, చెత్త తొలగించిన ప్రతి పాయింట్ వద్ద తప్పనిసరిగా బ్లీచింగ్ పౌడర్ చల్లాలని చెప్పారు. ఇకపై ప్రతిరోజూ ఉదయం తాను స్వయంగా క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి డ్యాష్ బోర్డ్ వివరాలను సరిపోలుస్తానని, ఈ తనిఖీలకు రాంకీ, మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది హాజరుకావాలని స్పష్టం చేశారు. డ్యాష్ బోర్డ్ లెకలు కాకుండా క్షేత్రస్థాయి ఫలితాలే ప్రామాణికమని కమిషనర్ తేల్చిచెప్పారు. ఈ తనిఖీల్లో అదనపు కమిషనర్ సీఎన్. రఘు ప్రసాద్, ఉప్పల్ డిప్యూటీ కమిషనర్ ఆనంద్, రాంకీ ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

