మద్యం తాగేందుకు వెళ్లి.. విద్యుదాఘాతంతో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి
మద్యం తాగేందుకు బహిరంగ ప్రదేశానికి వెళ్లిన ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు విద్యుదాఘాతానికి గురయ్యారు. పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని చూసి అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నంలో పంట పొలానికి పందుల బెడద నుంచి రక్షణగా ఏర్పాటు చేసిన విద్యుత్తు తీగలకు తగిలి ప్రాణాలు కోల్పోయారు.
మొయినాబాద్, అక్టోబర్ 31: మద్యం తాగేందుకు బహిరంగ ప్రదేశానికి వెళ్లిన ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు విద్యుదాఘాతానికి గురయ్యారు. పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని చూసి అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నంలో పంట పొలానికి పందుల బెడద నుంచి రక్షణగా ఏర్పాటు చేసిన విద్యుత్తు తీగలకు తగిలి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలో కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని చిలుకూరు గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న కేజీ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన 8 మంది విద్యార్థులు శుక్రవారం రాత్రి పెద్దమంగళారం రెవెన్యూ పరిధిలోని పద్మావతి ఫంక్షన్ హాల్ వెనుక ఉన్న బహిరంగ ప్రదేశంలో మద్యం తాగేందుకు వెళ్లారు. అక్కడ మద్యం సేవిస్తుండగా అదే సమయంలో పోలీస్ పెట్రోలింగ్ వాహనం అటుగా వచ్చింది. దాన్ని చూసిన విద్యార్థులు భయపడి అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ క్రమంలో అడవి పందుల నుంచి పంట కాపాడుకునేందుకు ఓ రైతు పొలం చుట్టూ వేసిన విద్యుత్ తీగలకు తగిలారు. దీంతో విద్యుదాఘాతానికి గురై ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతుల వివరాలను సేకరించారు. మృతులను అత్తాపూర్‌కు చెందిన మోక్ష సాయి చరణ్ (20), బల్కంపేటకు చెందిన యశ్వంత్ (20)గా గుర్తించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
కాగా, పంట పొలం చుట్టూ విద్యుత్ తీగలు ఏర్పాటు చేయడమే ఇద్దరు విద్యార్థుల మృతికి కారణమైందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. పొలానికి విద్యుత్తు తీగలు ఏర్పాటు చేసిన రైతుపై కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మద్యం తాగేందుకు వెళ్లి.. విద్యుదాఘాతంతో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబం’ జోరు.. 24 గంటల్లోనే 2.14 లక్షలకు పైగా టికెట్లు అమ్మకం!
One Lakh Crore | నెలకు రూ.10వేల జీతం.. కానీ బ్యాంక్ అకౌంట్లో లక్ష కోట్లు.. చివరకు షాక్!
Rajeev Kanakala | ‘డ్రాగన్’తో ఎన్టీఆర్ అభిమానులు రెండు కాలర్లు ఎగరేయడం ఖాయం.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
Traffic Challan | ఫుట్‌పాత్‌పై బైక్ నడిపితే రూ.5 వేలు.. వన్‌వేలో వెళ్తే రూ.10 వేల ఫైన్? బెంగళూరులో కఠినంగా ట్రాఫిక్ రూల్స్!!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

