గాంధీయే స్ఫూర్తి..!
పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో దేశ భక్తిని పెంపొందింపచేయాలని, దేశ స్వతంత్ర చరిత్రను తెలియ జెప్పాలనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలోచనల మేరకే గాంధీ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు
- విద్యార్థుల్లో దేశ భక్తిని పెంపొందింపచేయాలి
- స్వతంత్ర సమరయోధుల చరిత్రను తెలియ జెప్పాలనే గాంధీ చిత్ర ప్రదర్శన
- సహకరించిన ప్రతినిధులకు మంత్రి తలసాని సన్మానం
సిటీబ్యూరో, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో దేశ భక్తిని పెంపొందింపచేయాలని, దేశ స్వతంత్ర చరిత్రను తెలియ జెప్పాలనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలోచనల మేరకే గాంధీ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు.
15 రోజులపాటు నిర్వహించిన భారత స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా విద్యార్థుల కోసం గాంధీ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించడానికి సహకరించిన తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్, డిజిటల్ సర్వీస్ ప్రతినిధులను శుక్రవారం మాసాబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో ఎఫ్డీసీ చైర్మన్ అనిల్‌కుమార్ కూర్మాచలం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఎఫ్డీసీ ఎండీ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రవిగుప్తాలతో కలిసి తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సునీల్ నారంగ్, కార్యదర్శి అనుపమ్ రెడ్డి, తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బసిరెడ్డి, కార్యదర్శి దామోదర్‌ప్రసాద్, క్యూబ్, యూఎఫ్ఓ పీఎస్డీ డిజిటల్ సర్వీస్ ప్రతినిధులను శాలువాతో సతరించి మెమొంటోలను అందజేసి ఘనంగా సన్మానించారు.
552 స్రీన్లలో 22.57లక్షల మంది విద్యార్థుల వీక్షణ
దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నెల 8 నుంచి 22వ తేదీ వరకు 15 రోజులపాటు రాష్ట్రంలోని 552 స్రీన్లలో చిత్రాన్ని ప్రదర్శించగా, 22.57 లక్షల మంది విద్యార్థులు వీక్షించారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డీసీ ఈడీ కిశోర్ బాబు, ఐ అండ్ పీఆర్ డైరెక్టర్ రాజమౌళి, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కేసుల్లో కన్విక్షన్ శాతం పెంచేలా సమర్థవంతంగా పని చేయాలి’
అన్ని డివిజన్ల సమగ్ర అభివృద్ధే లక్ష్యం : నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య
Patlolla karthik Reddy | డైరెక్టుగా గెజిట్ వచ్చింది.. సీఎంకు సంబంధం లేదంటే నమ్ముదామా..? : పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
Raptadu Incident | రాప్తాడు ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్..బాధితురాలి తల్లితో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు
Patriot Missiles: ఉక్రెయిన్‌కు 500 పేట్రియాట్ మిస్సైళ్లు: అమెరికా
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

