అవస్థలు ఇంకెన్నాళ్లు?
జవహర్‌నగర్ డపింగ్ యార్డ్ శాశ్వత సమస్య పరిష్కారంపై ముందుకు కదలని ప్రణాళికతో డంపింగ్ యార్డ్ సమీపంలో నివసిస్తున్న లక్షలాది ప్రజలు ప్రభుత్వ నిర్లక్ష్యంపై అసహనానికి గురవుతున్నారు. డంపింగ్ యార్డ్ శాశ్వతంగా తొలంగించే విధంగా చర్యలు తీసుకోవాలని 6 నెలలుగా డపింగ్ యార్డ్ సమీపంలోని ప్రజలు జేఎసీగా ఏర్పడి పోరాటం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.
- ‘జవహర్‌నగర్ డంపింగ్’ సమస్యకు పరిష్కారమేది?
- జేఏసీ ఆధ్వర్యంలో సీఎంను కలిసినా ఫలితం శూన్యం
- స్పందించకుంటే.. మహాధర్నా : ఎమ్మెల్యే మల్లారెడ్డి
మేడ్చల్, అక్టోబర్10(నమస్తే తెలంగాణ): జవహర్‌నగర్ డపింగ్ యార్డ్ శాశ్వత సమస్య పరిష్కారంపై ముందుకు కదలని ప్రణాళికతో డంపింగ్ యార్డ్ సమీపంలో నివసిస్తున్న లక్షలాది ప్రజలు ప్రభుత్వ నిర్లక్ష్యంపై అసహనానికి గురవుతున్నారు. డంపింగ్ యార్డ్ శాశ్వతంగా తొలంగించే విధంగా చర్యలు తీసుకోవాలని 6 నెలలుగా డపింగ్ యార్డ్ సమీపంలోని ప్రజలు జేఎసీగా ఏర్పడి పోరాటం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.
డంపింగ్ యార్డ్‌ను పూర్తిగానైనా తొలగించాలి లేదా నగరానికి నాలుగు వైపులా డంపింగ్ యార్డ్‌లను ఏర్పాటు చేసి జవహర్‌నగర్‌కు చెత్తను రాకుండా చేయాలన్న డిమాండ్‌తో జేఎసీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తున్నారు. కాగా, డంపింగ్ జేఎసీ ఉద్యమ నేపథ్యంలో డంపింగ్ యార్డ్ శాశ్వత సమస్య పరిష్కరానికి అన్ని పార్టీలను కలిపి అఖిలపక్ష కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. మే 4న సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి డంపింగ్ యార్డ్‌తో లక్షలాది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష కమిటీ సభ్యులు కోరినా..ఫలితం లేకుండాపోయింది.
అధికారుల నిర్లక్ష్యం
డంపింగ్ యార్డ్ సమస్యపై అధికారుల నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రేడ్డి పూర్తి స్థాయిలో నివేదిక కోరినా.. ఇప్పటి వరకు తిరిగి అఖిలపక్ష కమిటీతో అధికారులు ఎలాంటి సమావేశాలు నిర్వహించలేదు. నివేదిక ఇచ్చిన తర్వాత అఖిలపక్ష కమిటీతో సమావేశం ఏర్పాటు చేసుకుని డంపింగ్ యార్డ్ సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపాలి అనే దానిపై చర్చించి అఖిలపక్ష కమిటీ సభ్యుల నుంచి అభిప్రాయాలను తీసుకోవాలని, అదే విధంగా మారిన పరిస్థితుల ఆధారంగా విదేశాల్లో చెత్త సేకరణ కోసం అవలంభిస్తున్న శాస్త్రీయ విధానాలను ఆధ్యయనం చేసేందుకు అససరమైతే అఖిలపక్ష పార్టీ కమిటీలతో పాటు అధికారుల బృందాన్ని పంపుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చినా.. ఇప్పటివరకు ప్రణాళిక అమలుకు నోచుకోకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు.
దుర్వాసనతో అవస్థలు
దురాస్వనతో ప్రజలు అనేక రోగాల భారిన పడి చనిపోతున్నా.. ప్రభుత్వం పట్టించుకోదా అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డంపింగ్ యార్డ్‌కు ప్రతి రోజు 8500 నుంచి 12, 500 వందల వరకు టన్నుల చెత్తను నగరంలోని నలుమూలల నుంచి తరలిస్తున్నారు. 339 ఎకరాల విస్తీర్ణంలో పేరుకుపోయిన చెత్త నుంచి వెలువడుతున్న దుర్గంధపు నీరు సమీప చెరువులు, బోరు నీటిని కలుషితం చేస్తుంది. జవహర్‌నగర్, దమ్మాయిగూడ, నాగారంలలో భూగర్భ జలాలు కూడా కలుషితం కావడంతో తాగునీటి సమస్య తీవ్రంగా ఏర్పడింది. పక్షలు, జంతువులు కూడా నివసించలేని పరిస్థితి ఏర్పడిందని ప్రజలు వాపోతున్నారు.
ప్రభుత్వం స్పందించకుంటే మహాధర్నా
జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ పై ప్రభుత్వం స్ప ందించకుంటే త్వ రలోమహాధ ర్నా నిర్వహిస్తాం. అ భిలపక్ష కమిటీ సభ్యులు డంపింగ్ యార్డ్ సమస్యను ముఖ్యమంత్రి రేవ ంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినా అధికారులు స్పందించడం లేదు. ఇదే తీరు ను అధికారులు కొనసాగిస్తే మహాధర్నా నిర్వహించేలా ప్రణాళికను సిద్ధం చేస్తు న్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లో డంపింగ్ యార్డ్ నుంచి దుర్వాసన రాకుండా ఉండేలా అనేక చర్యలు తీసుకుంది. ప్రత్యేకంగా రూ. 140 కో ట్లు కేటాయించి డంపింగ్ యార్డ్ చెత్త నుంచి వచ్చే నీటి ద్వారా చెరువులు, భూగర్భ జలాలు కలుషితం కాకుండా నీటి శుద్థి యంత్రాలు, విద్యుత్ ఉత్ప త్తి కేంద్రం, డంపింగ్ యార్డ్‌పై క్యాం పింగ్ వంటి ఏర్పాట్లు చేశాం. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఒక్క పైసాను కేటాయించలేదు.
– ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

