హైదర్‌గూడలో భూ ప్రకంపనలు
అత్తాపూర్ సర్కిల్ పరిధిలో భారీ శబ్ధంతో పలు కాలనీల ప్రజలను భయ భ్రాంతులకు గురి చేసింది.రెప్పపాటుగా వచ్చిన భూకంపం స్థానికులను భయందోళనకు గురి చేసింది
బండ్లగూడ,అక్టోబర్ 27: అత్తాపూర్ సర్కిల్ పరిధిలో భారీ శబ్ధంతో పలు కాలనీల ప్రజలను భయ భ్రాంతులకు గురి చేసింది.రెప్పపాటుగా వచ్చిన భూకంపం స్థానికులను భయందోళనకు గురి చేసింది.అత్తాపూర్ సర్కిల్ హైదర్‌గూడ పరిసర ప్రాంతాల్లోని న్యూఫ్రెండ్స్కాలనీ,ఎర్రబోడ,చైతన్యవిలాస్,వెంకటేశ్వర కాలనీ,సిరిమల్లే నగర్,లంగర్‌హౌజ్ తదితర ప్రాంతాల్లో మంగళవారం ఉదయం 9 గంటల 15 నిమిషాల ప్రాంతంలో భారీ శబ్దం వచ్చింది. దీంతో స్థానికులు భూమి కంపించిందని ఒక్క సారిగా బయటకు పరుగులు తీశారు.కాగా రెండు మూడు సెకన్ల పాటు వచ్చిన భూ కంపంతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు ఆనవాళ్లు తెలియలేదు.రోజు లాగానే అందరూ తమ తమ పనిలో నిమగ్నం అయి ఉన్న ప్రజలకు భారీ శబ్దం రావడంతో భయందోళనకు గురైనట్లు స్థానికులు తెలిపారు.
టీ తాగుతుండగా భారీ శబ్దం
టిఫిన్ సెంటర్ వద్ద టీ తాగుతుండగా ఒక్క సారిగా భారీ శబ్దం రావడంతో కొద్దిగా వణుకు వచ్చింది. హోటల్లో సిలిండర్ పేలి ఉండొచ్చని హోటల్ నిర్వాహకులను అడిగా. అదేమి లేదని తెలపడంతో ఎక్కడో పేలుడు సంభవించిందని అనుకున్నా. తర్వాత భూమి కంపించందని తెలిసింది.
-రాజు,హైదర్‌గూడ వాసి
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Earthquake
- Hyderabad
- Hyderguda
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

