ACB | రూ. 20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మాదాపూర్ ఎస్ఐ
ACB | మాదాపూర్ ఎస్ఐ రంజిత్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా ఎస్ఐ రంజిత్‌తో పాటు రైటర్ విక్రమ్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ACB | హైదరాబాద్ : మాదాపూర్ ఎస్ఐ రంజిత్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా ఎస్ఐ రంజిత్‌తో పాటు రైటర్ విక్రమ్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరిని అధికారులు విచారిస్తున్నారు. మాదాపూర్ పీఎస్ సిబ్బంది అవినీతిపై రెండు రోజులుగా ఏసీబీ అధికారులు నిఘా ఉంచారు.
మాదాపూర్ సాయి నగర్లో లక్ష్మణ్ నాయక్ ఇంటి నిర్మాణం చేపట్టారు. తన స్థలంలో ఇల్లు కడుతున్నాడని లక్ష్మణ్‌పై సుధా అనే మహిళ ఫిర్యాదు చేసింది. సుధా ఫిర్యాదు మేరకు లక్ష్మణ్ నాయక్‌పై కేసు నమోదు చేశారు. అనంతరం పోలీసు స్టేషన్‌కు రావాలంటూ ఎస్ఐ రంజిత్, రైటర్ విక్రమ్ కలిసి లక్ష్మణ్‌కు ఫోన్ చేశారు. రూ. లక్ష ఇవ్వాలని లక్ష్మణ్ నాయక్‌ను డిమాండ్ చేశారు. డబ్బులు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. డబ్బులు ఇవ్వకపోతే లక్ష్మణ్ కూతురు, అల్లుడిపై కేసు నమోదు చేస్తామని ఎస్ఐ బెదిరించాడు. దీంతో ఎస్ఐ, రైటర్‌పై లక్ష్మణ్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళిక ప్రకారం ఎస్ఐ రంజిత్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Acb
- Hyderabad
- Madapur
- SI Ranjith
RELATED ARTICLES
తాజా వార్తలు
Feel Good | ‘ఫీల్ గుడ్’ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల!
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

