సిటీబ్యూరో, జూలై 9 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. గురువారం రాత్రి 9 గంటల వరకు కాప్రాలో 1.20 సెం.మీలు, కీసరలో 1.10 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు. కాగా రాగల 36గంటల్లో గ్రేటర్లోని పలు చోట్ల తీవ్రమైన ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. కాగా ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 33.5 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 23.6 డిగ్రీలు, గాలిలో తేమ 56 శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.