Komuravelli Mallanna | వైభవంగా మల్లన్న కల్యాణ మహోత్సవం.. వేద మంత్రోచ్చరణలతోమార్మోగిన కొమురవెల్లి క్షేత్రం
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. క్షేత్రంలోని తోటబావి కల్యాణ వేదిక వద్ద జరిగిన కల్యాణోత్సవానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. వీరశైవ ఆగమశాస్త్ర ప్రకారం కల్యాణం నిర్వహించగా, పట్టువస్ర్తాలు, ము త్యాల తలంబ్రాలను ఆలయవర్గాలు సమర్పించారు.
- పట్టువస్ర్తాలు సమర్పించిన ఆలయవర్గాలు
- హాజరైన ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, చామకూర మల్లారెడ్డి,
Komuravelli Mallanna | చేర్యాల, డిసెంబర్ 29: సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. క్షేత్రంలోని తోటబావి కల్యాణ వేదిక వద్ద జరిగిన కల్యాణోత్సవానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. వీరశైవ ఆగమశాస్త్ర ప్రకారం కల్యాణం నిర్వహించగా, పట్టువస్ర్తాలు, ము త్యాల తలంబ్రాలను ఆలయవర్గాలు సమర్పించారు. కల్యాణోత్సవంలో స్వా మి వారి తరపున పడిగన్నగారి ఆంజనేయులు దంపతులు,అమ్మవార్ల తరపున మహదేవుని భాస్కర్ దంపతులు పాల్గొన్నారు. గర్భగుడిలో జరిగిన కల్యాణోత్సవంలో అమ్మవారి తరపున మహాదేవుని రవి, స్వామి వారి తరపున పడిగన్నగారి మల్లయ్య దంపతులు పాల్గొన్నారు. స్వామి,అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను అర్చకు లు ఆలయం నుంచి పోలీసుబొమ్మ, రాతిగీరలు, ఆల య పరిసరాల్లో ఊరేగించారు.
మేళతాళాలు, కోలా టం, చెక్క భజనలు, వేద పాఠశాల విద్యార్థుల శివకీర్తనలతో కల్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు. కాశీ పీఠాధిపతి డాక్టర్ మల్లికార్జున శివాచార్య మహాస్వామి వేద పర్యవేక్షణలో కల్యాణం జరిగింది. వీరశైవ ఆగమ పండితులు, పురోహితులు, ఆగమ పాఠశాల వేదపండితులు, ఆగమ విద్యార్థులు కల్యాణోత్సవం నిర్వహించారు. పురోహితులుగా నడిపుడి మఠం భవనయ్య స్వా మి, భువనేశ్వరస్వామి, ఆనందయ్య, జ్ఞానశ్వర్శాస్త్రి, చంద్రశేఖర్‌స్వామి, భద్రయ్యస్వామి వ్యహరించారు. డాక్టర్ మహంతయ్య,నందుల మఠం శశిభూషణ సిద్ధాంతి స్వామీజీ వ్యాఖ్యాతలుగా వ్యహరించారు. భక్తుల కోసం శామియానాలు, చలువ పంది ళ్లు ఏర్పాటు చేశారు. ఉదయం 5గంటలకు రెండు క్వింటాళ్ల బియ్యా న్ని అన్నం వండి రాశిగా తయారుచేసి దిష్టికుంభం తీశారు.
హాజరైన ప్రముఖులు
కల్యాణానికి ముందు ఊరేగింపుగా వెళ్లి స్వామి వారి తరపున మహదేవుని వంశస్తులు, పడిగన్నగారి వంశస్తులు కూర్చుని కల్యాణోత్సవం నిర్వహించారు. కల్యాణానికి తాళి, మట్టెలు, ఒడిబియ్యం, బట్టలను వారు తీసుకువచ్చారు. మధ్యాహ్నం 12గంటలకు రుద్రాభిషేకం, సాయంత్రం శకటోత్సవం నిర్వహించారు. స్వామివారికి పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలను ఆలయవర్గాలు సమర్పించాయి. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి,భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూ రి ప్రతాప్‌రెడ్డి, నాగపురి రాజలింగం, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యురాలు రంగు బాలలక్ష్మి హాజరయ్యారు.ఆలయ ఈవో ఎ.బాలాజీ, దేవాదాయశాఖ ఆర్జేసీ రామకృష్ణారావు ఆధ్వర్యంలో ప్రత్యేక అధికారు లు బృందం, ఆలయ ఏఈవో బుద్ది శ్రీనివాస్, సిబ్బంది కల్యాణోత్సవం సవ్యంగా సాగేందుకు చర్యలు తీసుకున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

