విశ్వనగరం.. నవశకం.. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో పరిఢవిల్లిన ప్రగతి
స్వరాష్ట్రంగా అవతరించిన తర్వాత కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ పాలన విశ్వనగరమైన హైదరాబాద్‌లో నవశకానికి నాంది పలికింది. పరిపాలనా సౌలభ్యం కోసం చేపట్టిన జిల్లాల పునర్విభజనతో గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పట్టణ, పల్లెల ముఖచిత్రం మారిపోయింది. ఉమ్మడి పాలనలో హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రాంతాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేవి.
- గ్రేటర్లో ప్రపంచ శ్రేణి మౌలిక వసతులు
- గ్లోబల్ సిటీగా హైదరాబాద్ అవతరణ
- జోడెద్దుల్లా అభివృద్ధి, సంక్షేమం పరుగులు
- జిల్లాల పునర్విభజనతో అద్భుత సత్ఫలితాలు
- కేసీఆర్ మార్కు పాలనతో సమగ్రాభివృద్ధి
- పట్టణ ప్రాంతాలకు వెల్లువెత్తిన పెట్టుబడులు
స్వరాష్ట్రంగా అవతరించిన తర్వాత కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ పాలన విశ్వనగరమైన హైదరాబాద్‌లో నవశకానికి నాంది పలికింది. పరిపాలనా సౌలభ్యం కోసం చేపట్టిన జిల్లాల పునర్విభజనతో గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పట్టణ, పల్లెల ముఖచిత్రం మారిపోయింది. ఉమ్మడి పాలనలో హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రాంతాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేవి. కొవ్వొత్తి చుట్టూ చీకటిలా నగర పరిసరాలు అంధకారంలో కొట్టుమిట్టాడేవి. ఉద్యోగ, ఉపాధి అవసరాలకు ప్రజలంతా నగరానికి వరుస కట్టేవారు. స్వరాష్ట్రంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. కేసీఆర్ దూరదృష్టి, పాలనా దక్షతతో బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఊహకందని విధంగా చిన్న జిల్లాలుగా అవతరించిన రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్‌లో అభివృద్ధి పరుగులు పెట్టింది. విస్తీర్ణం, దూరభారాలు తగ్గడంతో పాలనా ఫలాలు ప్రజల వద్దకు చేరువయ్యాయి. పాలనా వికేంద్రీకరణతో ప్రజలందరికీ సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి. నాలుగు చిన్న జిల్లాల్లోని పట్టణాలకు పెట్టుబడులు వెల్లువెత్తి ప్రగతి పథంలో దూసుకుపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమం పరిఢవిల్లింది.
-సిటీబ్యూరో
ప్రజల ముంగిటికే పాలన
అధికార వికేంద్రీకరణతోనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. పరిపాలనను ప్రజల ముంగిటికే తీసుకురావాలన్నదే మా ప్రభుత్వ ప్రధాన ఆశయం. పెద్ద జిల్లాలు ఉన్నప్పుడు ప్రజలు తమ సమస్యల కోసం రోజంతా ప్రయాణించి జిల్లా కేంద్రానికి రావాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ అవస్థలు తప్పాయి.

గతంలో ఒక కలెక్టర్ లక్షలాది మంది ప్రజల అవసరాలను పర్యవేక్షించాల్సి వచ్చేది, అది చాలా కష్టమైన పని. జిల్లాల విభజన తర్వాత ప్రజలకు, అధికారులకు మధ్య దూరం తగ్గింది. ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు మరింత అందుబాటులోకి వచ్చింది.
– కేసీఆర్
స్వరాష్ట్ర సాధన తర్వాత హైదరాబాద్ విశ్వనగరం వైపు వడివడిగా అడుగులు వేసింది. దశాబ్ద కాలంలో కేసీఆర్ నాయకత్వంలో సాధించిన సమగ్ర పురోగతి చరిత్రపుటల్లో నిలిచిపోయింది. బంగారు తెలంగాణకు దృఢమైన బాటలు పడ్డాయి. హైదరాబాద్ నగరాభివృద్ధికి స్వరాష్ట్రంలోని తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పకడ్బందీగా వ్యూహరచన చేశారు. నాలుగు వందల ఏండ్ల చరిత్ర కలిగిన నగర ఖ్యాతిని మరో ఆధునిక శతాబ్దం వైపు నడిపించడంలో కేసీఆర్ చూపిన దార్శనికత..పాలనా పటిమతో హైదరాబాద్ అన్ని రంగాల్లో అద్భుత విజయాలు సాధించింది. ఉపాధి అవకాశాలు కల్పించింది. ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అనతికాలంలోనే గ్లోబల్‌సిటీగా ఎదిగిన నగర వికాసాన్ని చూసి..విశ్వమే ఆశ్చర్యపోయింది.. ‘పదేండ్ల ప్రగతి ప్రస్థానాన్ని’ చూసి అబ్బురపడింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

