కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందే భారత్ రైలు ప్రారంభం
తెలంగాణలో రైల్వే అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 6,418 కోట్ల రూపాయలను కేటాయించిందని, మరో 31 రైల్వే స్టేషన్‌న్లను అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఢిల్లీలో మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రధానమంత్రి మోదీ వర్చువల్ విధానంలో కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించగా.. కాచిగూడలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రయాణికులకు అభివాదం తెలిపారు.
కాచిగూడ, సెప్టెంబర్ 24: తెలంగాణలో రైల్వే అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 6,418 కోట్ల రూపాయలను కేటాయించిందని, మరో 31 రైల్వే స్టేషన్‌న్లను అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఢిల్లీలో మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రధానమంత్రి మోదీ వర్చువల్ విధానంలో కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించగా.. కాచిగూడలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రయాణికులకు అభివాదం తెలిపారు. తొలిరోజు వివిధ పాఠశాలల విద్యార్థులు, జర్నలిస్టులు, రైల్వే టెక్నికల్ అధికారులు, సిబ్బంది, ఇతర రైల్వే అధికారులు ప్రయాణం చేశారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు షాద్‌నగర్, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూల్, డోన్, హిందూపురం, అనంతపురం, ధర్మవరం రైల్వేస్టేషన్లో ఆగుతుందని రైల్వే అధికారులు తెలిపారు.
తిరుగు ప్రయాణం యశ్వంత్‌పూర్ రైల్వేస్టేషన్ నుంచి మధ్యాహ్నం 2.45 నిమిషాలకు బయలుదేరి రాత్రి 11-15 నిమిషాలకు కాచిగూడ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుందన్నారు. అనంతరం దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ మాట్లాడుతూ.. కొత్తగా ప్రారంభమవుతున్న వందేభారత్ రైలు వల్ల ఐటీ రంగానికి రాజధానులైన హైదరాబాద్-బెంగళూరు స్టేషన్ల మధ్య వేగవంతమైన రైలు అనుసంధానాన్ని పెంపొందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాచిగూడ రైల్వేస్టేషన్ డైరెక్టర్ బాలాజీ, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాంచంద్రారెడ్డి, డాక్టర్ గౌతంరావు, కార్పొరేటర్లు ఉమా రమేశ్‌యాదవ్, అమృతతో పాటు వివిధ శాఖల రైల్వే అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాహుబలి 2 రికార్డు బద్దలు కొట్టిన ‘రామాయణ’.. 23 రోజుల్లోనే రూ.1,790 కోట్ల వసూళ్లు
Mysaa | ‘మైసా’ క్లైమాక్స్ నచ్చలేదా? రష్మిక సినిమా వాయిదా వెనుక అసలు కారణం ఇదేనా!
Anil Ravipudi | అనిల్ రావిపూడి రామాయణం.. త్వరలోనే యానిమేషన్ మూవీ,స్వయంగా ప్రకటించిన స్టార్ డైరెక్టర్!
Sandeep Reddy Vanga | ‘స్పిరిట్’ తర్వాత సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ మూవీ ఫిక్స్.. ఎన్టీఆర్, మహేష్, బన్నీతో కాకుండా..
S.SRajamouli | ‘తమ్మీ నువ్వు మావోనివే’.. దుల్కర్ సల్మాన్‌పై రాజమౌళి ప్రశంసల వర్షం!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

