HYDRA | ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీ ఆగ్రహం.. గంగారం పెద్దచెరువును పరిశీలించిన హైడ్రా కమిషనర్
హైదరాబాద్ చందానగర్ పరిధిలోని గంగారం పెద్దచెరువును హైడ్రా (HYDRA) కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. సెక్యూరిటీ సిబ్బంది ఉన్నప్పటికీ పెద్దచెరువులో ఐదు ఎకరాలు కబ్జాకు గురైందని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీ విమర్శించిన విషయం తెలిసిందే.
హైదరాబాద్: హైదరాబాద్ చందానగర్ పరిధిలోని గంగారం పెద్దచెరువును హైడ్రా (HYDRA) కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. సెక్యూరిటీ సిబ్బంది ఉన్నప్పటికీ పెద్దచెరువులో ఐదు ఎకరాలు కబ్జాకు గురైందని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీ విమర్శించిన విషయం తెలిసిందే. చెరువుల సుందరీకరణ, పరిరక్షణపై హైడ్రాకు చిత్తశుద్ధి లోపించిందని ఆరోపించారు. ఈ నేపథ్యంతో గురువారం ఉదయం పెద్దచెరువును రంగనాథ్ పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కబ్జాకు హైడ్రా అండదండలా..
చెరువుల సుందరీకరణ, పరిరక్షణపై హైడ్రాకు చిత్తశుద్ధి లోపించిందని ఆరికపూడి గాంధీ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం మియాపూర్‌లోని పటేల్‌కుంట చెరువు సుందరీకరణ పనులను ప్రారంభించిన తర్వాత సమావేశంలో అరికెపూడి గాంధీ మాట్లాడుతూ చెరువుల పరిరక్షణ కోసం హైడ్రా సెక్యూరిటీ సిబ్బంది సమక్షంలోనే గంగారం చెరువులోని ఐదు ఎకరాల స్థలంలో అక్రమార్కులు మట్టి నింపారని మండిపడ్డారు. ఈ తతంగం చూస్తుంటే కబ్జాదారులకు హైడ్రా సిబ్బంది సహకరిస్తున్నట్టు అనుమానం కలుగుతున్నదని ఆరోపించారు. స్థలాల ఆక్రమణకు సహకరిస్తుండడం చూస్తుంటే చెరువుల పరిరక్షణపై హైడ్రాకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థమవుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెబుతుంటే, ఆ విభాగం సిబ్బంది చెరువు స్థలాలను అన్యాక్రాంతమయ్యేలా వ్యవహరించం సరికాదని మండిపడ్డారు.
హైడ్రాలో అసలేం జరుగుతున్నది?
హైడ్రా వ్యవహారం వివాదాస్పదమవుతున్నది. ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి చెందిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి హైడ్రాపై తీవ్ర ఆరోపణలు చేశారు. నోటీసుల పేరుతో హైడ్రా దందా చేస్తున్నదని సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే క్యాబినెట్ హోదాలో ఉన్న పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ హైడ్రా తీరును తప్పుబట్టారు. రాజకీయాల కోసం తాను మాట్లాడటంలేదని, పూర్తిస్థాయి సమాచారంతోనే వివరాలు వెల్లడిస్తున్నట్టు చెప్పారు. ఈ విషయాన్ని మీ అధికారులకు చెప్పండి అంటూ అక్కడే ఉన్న హైడ్రా సిబ్బందిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

