సిటీబ్యూరో, మే 5 (నమస్తే తెలంగాణ): ఉపరితల ఆవర్తనంతో పాటు ఆగ్నేయ, దక్షిణ దిశల నుంచి తెలంగాణ వైపునకు దిగువ స్థాయి గాలుల ప్రభావానికి తోడు ఈనెల 8న మధ్య బంగాళఖాతంలో తుఫాన్ ఏర్పడే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
వీటి ప్రభావంతో రాగల మూడు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు.