సిటీబ్యూరో: గ్రేటర్లో భిన్న వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొట్టగా సాయంత్రానికి వాతావరణం చిరు జల్లులతో ఒకసారిగా చల్లబడింది. ఆకాశం మేఘావృతమై నగరంలోని చాలా చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి.
కాగా, గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 38.7 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 27.1 డిగ్రీలు, గాలిలో తేమ 60 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా ద్రోణి ప్రభావంతో రాగల మరో రెండు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.