హైదరాబాద్ డ్రగ్స్ కేసును పోలీసులు చాలెంజింగ్‌గా తీసుకున్న విషయం తెలిసిందే. ఈకేసులో ప్రధాన నిందితుడు టోనీతో మరికొందరిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరిన్ని వివరాలు లాగేందుకు టోనీని పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోర్టుకు పంజాగుట్ట పోలీసులు తెలిపారు. దీంతో టోనీకి ఐదురోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. ఇవాళ చంచలగూడ జైలు నుంచి టోనీని పంజాగుట్ట పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. అతడిని ఐదు రోజుల పాటు పోలీసులు ప్రశ్నించనున్నారు. హైదరాబాద్‌లో తనకు ఏ ప్రముఖులతో సంబంధాలు ఉన్నాయో తేల్చే పనిలో పడ్డారు పోలీసులు.