హిమాయత్ సాగర్‌కు భారీ వరద.. నాలుగు గేట్లు ఎత్తివేత
హిమాయత్ సాగర్ | జీహెచ్ఎంసీ పరిధిలో గురువారం రాత్రి భారీ వాన కురిసింది. మూడు గంటలపాటు కుండపోతగా వర్షం కురవడంతో జంట జలాశయాల్లోకి వరద నీరు పోటెత్తింది.

హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో గురువారం రాత్రి భారీ వాన కురిసింది. మూడు గంటలపాటు కుండపోతగా వర్షం కురవడంతో జంట జలాశయాల్లోకి వరద నీరు పోటెత్తింది. దీంతో హిమాయత్ సాగర్‌లోకి 500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది. ఇప్పటికే చెరువు పూర్తిగా నిండి ఉండటంతో అధికారులు నాలుగు గేట్లు ఎత్తి 1400 క్యూసెక్కుల నీటిని దిగువకు విదుల చేస్తున్నారు. హిమాయత్‌సాగర్‌లో ప్రస్తుతం 1762 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది. సాగర్ గరిష్ఠ నీటిమట్టం 1763.5 అడుగులు.
ఇక ఉస్మాన్‌సాగర్‌లోకి 250 క్యూసెక్కుల నీరు వస్తున్నది. చెరువులో ప్రస్తుతం 1788.5 అడుగుల వద్ద నీరు ఉన్నది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

