హైదరాబాద్ : హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు వరద పోటెత్తింది. ఈ క్రమంలో ఉస్మాన్ సాగర్ 6 గేట్లు నాలుగు అడుగుల మేర, హిమాయత్ సాగర్ రెండు గేట్లు ఒక అడుగు మేర ఎత్తి మూసీకి నీటిని విడుదల చేస్తున్నారు.
ఉస్మాన్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,790 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1,789.40 అడుగులుగా ఉంది. ఇన్ ఫ్లో 2,400 క్యూసెక్కులుగా, ఔట్ ఫ్లో 2,652 క్యూసెక్కులుగా ఉంది. ఇక హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,763.50 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1,762.20 అడుగులుగా ఉంది. హిమాయత్ సాగర్ ప్రాజెక్టు ఇన్ ఫ్లో 600 క్యూసెక్కులుగా, ఔట్ ఫ్లో 678 క్యూసెక్కులుగా ఉంది.