Hayathnagar | నా కోరిక తీరిస్తే నీ భర్తతో గొడవ పరిష్కరిస్తా.. మహిళకు హయత్‌నగర్ ఎస్సై వేధింపులు
భర్త వేధింపులు భరించలేక ఫిర్యాదు చేసేందుకు పోలీసుల దగ్గరకు వెళ్తే ఓ ఎస్సై దుర్మార్గంగా ప్రవర్తించాడు. భర్తతో ఉన్న విబేధాలను పరిష్కరించాలంటే.. తన కోరిక తీర్చాలని బలవంతపెట్టాడు. ఎవరూ లేనప్పుడు చెబితే ఇంటికి వస్తానంటూ నిత్యం వాట్సాప్‌లో కాల్ చేసి ఆమెకు వేధింపులకు గురిచేశాడు.
భర్త వేధింపులు భరించలేక ఫిర్యాదు చేసేందుకు పోలీసుల దగ్గరకు వెళ్తే ఓ ఎస్సై దుర్మార్గంగా ప్రవర్తించాడు. భర్తతో ఉన్న విబేధాలను పరిష్కరించాలంటే.. తన కోరిక తీర్చాలని బలవంతపెట్టాడు. ఎవరూ లేనప్పుడు చెబితే ఇంటికి వస్తానంటూ నిత్యం వాట్సాప్‌లో కాల్ చేసి ఆమెకు వేధింపులకు గురిచేశాడు. హైదరాబాద్‌లోని హయత్ నగర్ పీఎస్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ.. తన భర్త వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసేందుకు హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. అయితే సదరు మహిళపై కన్నేసిన ఎస్సై సైదులు ఆమె ఫోన్ నంబర్ తీసుకున్నాడు. అప్పట్నుంచి ఆమెను కాల్ చేసి వేధించడం మొదలుపెట్టారు. నీ భర్తతో ఉన్న సమస్యను పరిష్కరిస్తా.. నా కోరిక తీర్చాలంటూ బలవంతపెట్టాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చెప్ప వస్తానంటూ వాట్సాప్ కాల్ చేస్తూ వేధింపులకు గురిచేశాడు. ఈ విషయం బయటకు రావడంతో సదరు మహిళను పోలీస్ స్టేషన్‌కు పిలిపించుకుని.. ఎవరికీ చెప్పొద్దని బెదిరింపులకు సైతం పాల్పడ్డారు. దీంతో ఆ మహిళ రాచకొండ కమిషనర్ సుధీర్‌బాబుకు ఫిర్యాదు చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

