Hyderabad | గచ్చిబౌలి జనాన్ని వణికించిన ఆ భవనం కూల్చివేత పనులు షురూ..!
Hyderabad | కొన్ని గంటల పాటు ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురిచేసిన కొండాపూర్ డివిజన్ సిద్ధిక్‌నగర్‌లో(Siddiqnagar) పక్కకు ఒరిగిన భవనాన్ని(Demolish building) అధికారులు హైడ్రాలిక్ మిషన్‌తో కూల్చివేస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అధికారులు స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించి పకడ్బందీగా కూల్చివేత పనులు మొదలు పెట్టారు
హైదరాబాద్ : కొన్ని గంటల పాటు ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురిచేసిన కొండాపూర్ డివిజన్ సిద్ధిక్‌నగర్‌లో(Siddiqnagar) పక్కకు ఒరిగిన భవనాన్ని(Demolish building) అధికారులు హైడ్రాలిక్ మిషన్‌తో కూల్చివేస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అధికారులు స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించి పకడ్బందీగా కూల్చివేత పనులు మొదలు పెట్టారు. కాగా, ఐటీ కారిడార్‌కు కేరాఫ్‌గా ఉన్న గచ్చిబౌలిలో అక్రమ నిర్మాణాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కొండాపూర్ డివిజన్ సిద్ధిక్‌నగర్‌లో ఓ నిర్మాణదారుడు కనీస ప్రమాణాలు పాటించకుండా బహుళ అంతస్తుల నిర్మాణం పుట్టింగుల కోసం తీసిన గుంతల కారణంగా పక్కనే ఉన్న భవనాలను ప్రమాదంలో పడేసింది.
ఎటువంటి సెట్‌బ్యాక్ లేకుండా తీసిన గుంతలతో పక్కనే ఉన్న నాలుగంతస్తుల భవనం ఓ వైపునకు ఒరిగింది. శేరిలింగంపల్లి సర్కిల్ -20 పరిధి.. కొండాపూర్ డివిజన్ సిద్ధిక్‌నగర్ రోడ్డు నం.1లో ఓ బిల్డర్ 200ల గజాల స్థలంలో భారీ బహుళ అంతస్తుల నిర్మాణ పనులు చేపట్టాడు. గత వారం రోజులుగా పుట్టింగుల నిర్మాణం కోసం గుంతలు తవ్వి పిల్లర్ల నిర్మాణ పనులు చేపట్టారు. ఎలాంటి ప్రమాణాలు పాటించకుండా, కనీస సెట్బ్యాక్లు వదలకుండా గుంతలు తవ్వడంతో పక్కనే ఉన్న ప్లాట్ నంబర్ 1639లోని లక్ష్మణ్ అనే వ్యక్తికి చెందిన నాలుగంతస్తుల భవనం పిల్లర్లు బయటకు వచ్చి ఓ పక్కకు ఒరిగింది.
భవనంలో ఉంటున్న వారు ఒక్కసారిగా భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. స్థానికులు గమనించి వెంటనే పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ బృందం, హైడ్రా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. భవనంలో ఉన్న వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. మరోవైపు ఈ భవనం చుట్టు ప్రక్కల భవనాల ప్రజలను సైతం అధికారులు ఖాళీ చేయించారు. ఎలాంటి సెట్‌బ్యాక్ లేకుండా కేవలం 60గజాల స్థలంలో నాలుగంతస్తుల భవనం నిర్మించగా, దాని పక్కనే మరో వ్యక్తి 200ల గజాల స్థలంలో భారీ బహుళ అంతస్తుల భవనం నిర్మించేందుకు గుంతలు తవ్వడంతో మొత్తం భవనాలకు ప్రమాదకరంగా మారింది.


Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

