మిఠాయి దుకాణాలపై జీహెచ్ఎంసీ కొరడా
గ్రేటర్లో మిఠాయి తయారీ కేంద్రాలు, విక్రయశాలలపై జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు కొరడా ఝళిపించారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న కల్తీరాయుళ్లపై ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ నిర్వహించింది. మంగళవారం గ్రేటర్‌వ్యాప్తంగా చేపట్టిన ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
- 25 కిలోల స్టాక్ సీజ్
సిటీబ్యూరో, మార్చి 25 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో మిఠాయి తయారీ కేంద్రాలు, విక్రయశాలలపై జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు కొరడా ఝళిపించారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న కల్తీరాయుళ్లపై ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ నిర్వహించింది. మంగళవారం గ్రేటర్‌వ్యాప్తంగా చేపట్టిన ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని 18 మిఠాయి కేంద్రాల్లో అధికారులు తనిఖీలు చేపట్టగా, నాణ్యత విషయంలో అనుమానం ఉన్న 38 రకాల మిఠాయి నమూనాలను సేకరించారు. వీటిని పరీక్షల నిమిత్తం నాచారం పారిశ్రామిక ప్రాంతంలోని స్టేట్ ఫుడ్ లేబొరేటరీకి పంపినట్లు అధికారులు పేర్కొన్నారు. కల్తీ జరిగినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
రోలెక్స్ కన్ఫెక్షనరీకి షోకాజ్ నోటీసు
కాటేదాన్‌లోని రోలెక్స్ కన్ఫెక్షనరీపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆహార భద్రతా ప్రమాణాలు (లేబులింగ్, డిస్ప్లే) పాటించనందుకుగాను సుమారు 25 కిలోల మిఠాయిలను సీజ్ చేశారు. నిబంధనల ఉల్లంఘనపై సదరు సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వెల్లడించారు. పలు దుకాణాలకు ఇంప్రూవ్మెంట్ నోటీసులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. నిర్ణీత గడువులోగా లోపాలను సరిదిద్దుకోకపోతే లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించారు. ప్రజలకు స్వచ్ఛమైన ఆహారం అందించడమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టామని ఫుడ్ సేఫ్టీ వింగ్ అధికారులు వెల్లడించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Adulterated
- GHMC
- sweet shops
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అర్హులు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాకు దరఖాస్తు చేసుకోవాలి’
భూ భారతి చట్టంపై న్యాయ విద్యార్థులకు ప్రత్యేక అవగాహన
Siraj | ఆ పేరు కారణంగానే సిరాజ్‌ను సెలెక్ట్ చేయలేదు..! దుమారం రేపుతున్న రాజకీయ విమర్శలు
DK Shivakumar | మాకే తాగడానికి నీళ్లు లేవు, మికేలా ఇస్తాం.. సీఎం డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు
Avinash Reddy Arrest | కడప వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్..విడుదల
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

