అనాథలకు అమ్మానాన్నలా..
మతిస్థిమితం లేని అభాగ్యులకు అండగా నిలుస్తున్నాడు. అన్నీ తానై లాలిస్తున్నాడు. కావాల్సిన సపర్యలు చేస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి నాదర్గుల్లోని మాతృదేవో భవ అనాథ ఆశ్రమ నిర్వాహకుడు గట్టు గిరి.
- మానవత్వం చాటుకుంటున్న మాతృదేవోభవ ఆశ్రమ నిర్వాహకుడు
- భార్య, ముగ్గురు సేవకులతో కలిసి సపర్యలు
- అనాథ శవాలకు సైతం దహన సంస్కారాలు
బడంగ్‌పేట, ఫిబ్రవరి 3: మతిస్థిమితం లేని అభాగ్యులకు అండగా నిలుస్తున్నాడు. అన్నీ తానై లాలిస్తున్నాడు. కావాల్సిన సపర్యలు చేస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి నాదర్గుల్లోని మాతృదేవో భవ అనాథ ఆశ్రమ నిర్వాహకుడు గట్టు గిరి. అనాథలు, మతిస్థిమితం లేకుండా రోడ్లపై తిరుగుతున్న మొత్తం 112 మందికి మాతృదేవోభవ ఆశ్రమం ఏర్పాటు చేసి సేవలందిస్తున్నాడు. తన భార్య ఇందిర, మరో ముగ్గురితో కలిసి వారిని కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. ప్రతి నెలా వైద్య సేవలు అందించడంతో పాటు ఎవరైనా అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే దహన సంస్కారాలు చేస్తున్నాడు.
53 మందికి దహన సంస్కారాలు..
మానవ సేవే మాధవ సేవగా భావిస్తున్న రవి ఆశ్రమంలో మరణించిన అనాథలకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నాడు. ఇందుకయ్యే ఖర్చును తానే భరిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆశ్రమంలో చనిపోయిన 11 మందితోపాటు.. మరో 42 మందికి దహన సంస్కారాలు చేశాడు. ఏ మతం వారైతే ఆ మత సంప్రదాయాల ప్రకారం దహన సంస్కారాలు అక్కడ నిర్వహిస్తున్నారు.
సేవ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది..
అనాథలకు ఆశ్రయం కల్పిస్తున్నా. వారు మరణించిన తర్వాత అనాథ అన్న భావన తొలిగించేందుకు నేనే దగ్గరుండి దహన సంస్కారాలు నిర్వహిస్తున్నా. వారి అస్థికలను గంగా, కృష్ణా నదుల్లో కలుపుతున్నా. ఇప్పటి వరకు ఆశ్రమంలోని 11, బయటి వారు 42 మందికి దహన సంస్కారాలు చేశా. ఒక్కొక్కరి దహన సంస్కారాలకు రూ.8 వేలు ఖర్చు అవుతున్నది. అనాథలకు సేవ చేసే భాగ్యం దొరకడం అదృష్టంగా భావిస్తున్నా.
– రవి , మాతృదేవో భవ ఆశ్రమ నిర్వాహకుడు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PF Withdraw | ఇకపై నెలనెలా పీఎఫ్ విత్‌డ్రా.. సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్‌కు ఈపీఎఫ్‌వో ఆమోదం
Shah Rukh Khan | షారుఖ్ఖాన్అరుదైన ఘనత.. ది 100 గ్రేటెస్ట్ మూవీ స్టార్స్ ఆఫ్ ఆల్‌టైమ్ జాబితాలో చోటు
KTR | రోత భాష ఏందీ రేవంత్.. కరువు, కన్నీళ్లతో బాధపడుతుంటే చిల్లర మాటలతో చిందులా??.. కేటీఆర్ ఫైర్
Sajjanar | పోస్టింగ్ ఎక్కడ ఇచ్చినా తగ్గేది లేదు.. సజ్జనార్ కీలక వ్యాఖ్యలు!
మాల వేసుకుని చెప్తున్న.. కాంగ్రెస్ మళ్లా రాదు!.. సీఎం కరప్షన్‌తో తీవ్రనష్టం.. రేవంత్‌పై ఎమ్మెల్యే రాజగోపాల్ ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

