Disappeared | గుడ్ వే ఫౌండేషన్ ఆశ్రమంలో నలుగురు యువకులు అదృశ్యం
Disappeared | గుడ్ వే ఫౌండేషన్ ఆశ్రమంలో(Goodway Foundation) నలుగురు యువకులు అదృశ్యమయ్యారు (Disappeared).
జవహర్‌నగర్, మే 26: గుడ్ వే ఫౌండేషన్ ఆశ్రమంలో(Goodway Foundation) నలుగురు యువకులు అదృశ్యమయ్యారు (Disappeared). ఈ సంఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధి దమ్మాయిగూడలో చోటుచేసుకుంది. ఎస్‌హెచ్‌వో నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం..దమ్మాయిగూడలోని(Dammaiguda) ఎల్ఎన్ఆర్కాలనీలో బోడ విజయ్‌కుమార్ గుడ్ వే ఫౌండేషన్‌ను నిర్వహిస్తున్నారు. గత 3 సంవత్సరాల నుంచి ఆశ్రమం నడిపిస్తూ మద్యం, డ్రగ్స్‌కు బానిసైన యువకులకు చికిత్సను అందిస్తున్నారు.
నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన యువకులు 15 రోజుల క్రితం మహ్మద్ అలీ(21), సయ్యద్ ఖలీల్(35), 45 రోజుల క్రితం అబుబాకర్(21), 3 నెలల క్రితం అబ్రార్ అలీ(26) ఆశ్రమంలో చేరారు. ప్రతి రోజు వీరికి మద్యపానానికి దూరంగా ఉండాలని అవగాహన కల్పిస్తూ, చైతన్యం చేస్తున్నారు. ఈ నెల 24 ఆశ్రమంలో ఎవరికి చెప్పకుండా కిచెన్ నుంచి బయటకు వెళ్లిపోయి ఇంత వరకు రాలేదు. దీంతో వారి ఆచూకీ కోసం చుట్టుపక్కల, బంధువుల వద్ద వెతికినా సమాచారం లభించలేదు. ఈ మేరకు ఆశ్రమ నిర్వాహకుడు విజయ్‌కుమార్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

